తమిళ సెన్షేషనల్ హిట్ సినిమా ‘96’ను తెలుగులో జానుగా రీమేక్ చేశారు. ఈ వారం మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ తో పాటు నెగిటివ్ రెస్పాన్స్ కూడా వచ్చింది. తమిళ 96 మ్యాజిక్ ను రీ క్రియేట్ చేయడం సాహసమే అంటూ చాలా మంది అనుకున్నారు. కాని దర్శకుడు ప్రేమ్ కుమార్ 96 లో ఉన్న మ్యాజిక్ ను జాను ద్వారా రీ క్రియేట్ చేయడంలో కొంతవరకు సక్సెస్ అయ్యాడని మెచ్చుకుంటున్నారు. కాని మ్యాజిక్ రీ క్రియేషన్ లో కొన్ని లాజిక్ లను ప్రేమ్ కుమార్ మిస్ అయ్యాడు.

 

తమిళ్ వర్షన్ లో హీరో హీరోయిన్ 1996 సంవత్సరంలో పదవ తరగతి చదువుతూ ఉంటారు. అదే తెలుగు వర్షన్ లో హీరో హీరోయిన్ లుగా నటించిన శర్వా, సమంతల వయసును దృష్టిలో పెట్టుకుని 2004 సంవత్సరంలో పదవ తరగతి చదువుకున్నట్లుగా చూపించాడు దర్శకుడు. అంటే దాదాపుగా ఎనిమిది సంవత్సరాల తేడాతో అన్నట్టుగా స్క్రీన్ ప్లే ఏఅసుకున్నాడు. అయితే ఈ ఎనిమిది సంవత్సరాల్లో ఎన్నో టెక్నికల్ గా అద్బుతాలు జరిగాయి.

 

ముఖ్యంగా టెలీకమ్యూనియేషన్ అండ్ శాటిలైట్ రంగంలో అద్బుతమైన మార్పులు వచ్చాయి. 2000 సంవత్సరం నుండి వచ్చిన మార్పును ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాని 96లో ఎలా ఉండేదో అలాగే 2004 సంవత్సరంలో కథ నడుస్తున్నా కూడా అవే పరిస్థితులను చూపించడం మరీ విచిత్రం, విడ్డూరం. అంటే 1996లో టెక్నాలజీ ఎలా ఉండేది.. అప్పుడు టీవీలు ఎలా ఉన్నాయి.. టీవీలో కార్యక్రమాలనే 2004 సంవత్సరంకు చెందిన సీన్స్ లో కూడా చూపించారు.

 

అయితే ఈ రీ క్రియేషన్ చేయడం లో దర్శకుడు ఉన్నది ఉన్నట్లుగా చూపించేశాడు. ప్రేమ్ కుమార్ తమిళ దర్శకుడు కాబట్టి తనని తప్పు పట్టలేము. దిల్ రాజు టీం ప్రేమ్ కుమార్ ని సరిగ్గా గైడ్ చేసి ఆ లాజిక్స్ ని క్లియర్ గా చెప్పాల్సింది. తెలుగు రాష్ట్రంలో టెక్నాలజీ పరిస్థితిని ప్రేమ్ కుమార్ కి వివరిస్తే బాగుండేది అనే అభిప్రాయం సినిమా చూసిన ప్రేక్షకుల్లో వ్యక్తం అవుతుంది. ఏదేమైనా సినిమా పెద్ద సక్సస్ అయ్యోది. దిల్ రాజు సరిగ్గ పబ్లిసిటీ చేయకుండా, ఇలాంటి లాజిక్స్ మిస్ అవుతున్నా వదిలేశారు కాబట్టే హిట్ అంటున్నారంటే.  

మరింత సమాచారం తెలుసుకోండి: