సెలబ్రిటీలకు సంబంధించిన పర్సనల్‌ విషయాలు తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే కొంత మంది ఆకతాయిలు ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో కావాలనే పుకార్లను పుట్టిస్తుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ పుకార్లు నిజాలకన్నా వేగంగా జనాల్లోకి వెళ్లిపోతాయి. అలా ఈ వారం వైరల్‌గా మారిన టాలీవుట్ టాప్‌ గాసిప్‌ అనుష్క పెళ్లి గురించి. గతంలోనూ ఈ అందాల భామ పెళ్లి సంబంధించిన వార్తలు వైరల్ అయ్యాయి. అయితే తాజా వార్త జనాల్లో మరింత ఆసక్తికరంగా మారింది.


చాలా కాలంగా అనుష్క, యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ను పెళ్లి చేసుకోబోతుందన్న ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలను అనుష్క, ప్రభాస్‌లు చాలా సార్లు ఖండించినా, జనాలు మాత్రం మళ్లీ మళ్లీ అదే వార్తను వైరల్ చేశారు. అయితే తాజాగా ఆ రూమర్లకు ఫుల్‌స్టాప్‌ పెట్టే కొత్త గాసిప్‌ ఒకటి మీడియా సర్కిల్స్‌లో హల్‌చల్‌ చేస్తోంది. నిజానిజాల సంగతి పక్కనపెడితే సోషల్ మీడియాలో ఈ వార్త ఓ రేంజ్‌లో వైరల్‌ అవుతోంది.


లేటెస్ట్‌ గాసిప్‌ ప్రకారం.. ఉత్తరాదికి చెందిన ప్రస్తుత టీమిండియా క్రికెటర్‌ను అనుష్క పెళ్లిచేసుకోబుతుందట. ఇప్పటికే అంగీకరించిన సినిమాలను వీలైనంత త్వరగా పూర్తి చేసి ఆ తరువాత పెళ్లి చేసుకునేందుకు అనుష్క ప్లాన్‌ చేస్తుందట. అయితే ఈ క్రికెటర్‌ ఎవరన్న విషయం మాత్రం బయటకు రాలేదు. అసలు ప్రస్తుత ఇండియన్‌ క్రికెట్ టీంలో అనుష్క ఏజ్‌కు తగ్గ క్రికెటర్‌ ఎవరూ లేరు. అంటే అనుష్క.. వయసులో తనకంటే చిన్నవాడిని చేసుకుంటుందా..? అన్న చర్చ జరుగుతోంది .


లేక అనుష్క చేసుకోబోయేది మాజీ క్రికెటర్‌ను అయ్యుంటుందా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అయితే ఈ వార్తలపై అనుష్క టీం నుంచి మాత్రం ఎలాంటి ప్రకటన రాలేదు. ప్రస్తుతం ఈ భామ నిశ్శబ్దం సినిమా పనుల్లో బిజీగా ఉంది. బహు భాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా క్రాస్‌ ఓవర్‌ మూవీగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను కోన వెంకట్‌ నిర్మిస్తున్నాడు.


ఒక వేళ అనుష్క పెళ్లి గురించి మీడియాలో వచ్చిన కథనాలు నిజమే అయినా వరుడు కచ్చితంగా ప్రస్తుత టీమిండియా క్రికెటర్ అయితే అయ్యుండడు. బహుశా టీమిండియా మాజీ క్రికెటర్ అయ్యుండొచ్చు. చూద్దాం దీనిపై అనుష్క స్పందిస్తారో లేదో! ప్రస్తుతం అనుష్క ‘నిశ్శబ్దం’ సినిమా విడుదల కోసం వేచి చూస్తున్నారు. ఈ సినిమాలో అనుష్క మాట్లాడలేని అమ్మాయి పాత్రలో నటించారు. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లిష్, మలయాళం భాషల్లో ఏప్రిల్ 2న విడుదలవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: