ప్ర‌స్తుతం టాలీవుడ్ అంద‌గాళ్ళు అంటే ఫ‌స్ట్ వ‌చ్చే పేరు మ‌హేష్‌బాబు. హీ సో క్యూట్‌... హీ సో హాట్‌.. హీ సో హ్యాండ‌స‌మ్ అన్న పాట‌కు ఏ మాత్రం తీసిపోడు మ‌న మ‌హేష్‌బాబు. అయితే ఈ టాప్ స్టార్లంద‌రూ ఎప్పుడెప్పుడు ఏం చేస్తుంటారా అని వాళ్ళ ప‌ర్స‌న‌ల్ ఇన్‌ఫ‌ర్మేష‌న్ తెలుసుకోడానికి చాలా ఇంట‌స్ట్ర్ చూపిస్తుంటారు కొంద‌రు. అందులోనూ మ‌హేష్‌బాబు అంటే మ‌రీ ఎక్కువ యాంగ్జైటీ. ఫ్యాన్స్ ఆయ‌న ఇన్‌ఫ‌ర్మేష‌న్ కోసం క‌ళ్ళు కాయ‌లు కాచేలా ఎదురు చూస్తుంటారు. ఇక ఇదిలా ఉంటే ఈ వారం మ‌రి మ‌హేష్ పాన్స్ ఏంటి ఏం చేశాడు అన్న‌ది ఓ లుక్కేద్దాం.

 

ప్ర‌స్తుతం మ‌హేష్ స‌రిలేరునీకెవ్వ‌రు మూవీ హిట్ అయిన సంద‌ర్భంగా ఫ్యామిలీతో క‌లితో క‌లిసి హాలీడే ఎంజాయ్ చేస్తున్నారు. భార్య న‌మ్ర‌త‌, పిల్ల‌లు సితార‌, గౌత‌మ్‌ల‌తో క‌లిసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం మ‌హేష్ మూడు నెల‌ల పాటు ఏమీ మూవీస్ చేయ‌రు. ఆయ‌న కాస్త రెస్ట్‌లో ఉన్నారు. కాలికి చిన్న ఫ్రాక్చ‌ర్ అయిన కార‌ణాన త‌న‌కు ఒక మైన‌ర్ ఆప‌రేషన్ అవ‌స‌ర‌మ‌ని వైధ్యులు తెల‌ప‌గా ఆయ‌న ఆ ప‌నిలో ఉన్నార‌ని స‌మాచారం. కాబట్టి ప్ర‌స్తుతానికి మూడు నెల‌ల వ‌ర‌కు సినిమాలు ఏమీ చేసే ప‌ని పెట్టుకోవ‌డం లేదు. 

 

అంతేకాక మ‌హేష్ మ‌రో ప‌క్క బెంగుళూరులో ఒక మాల్ క‌ట్టే యోచ‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే హైద‌రాబాద్‌లో టాప్ మాల్స్‌లో ఒక‌టిగా నిలిచిన ఎఎంబి మాల్‌ను ఆయ‌నదే అన్న విష‌యం తెలిసిందే. అలాగే కూక‌ట్‌ప‌ల్లిలో కూడా ఆలాంటి మాల్ ఒక‌టి తీసుకురావాల‌ని అనుకుంటున్నారు. మ‌రి ఆయ‌న ఓప‌క్క సినిమాల్లో న‌టిస్తూనే త‌న వ్యాపార విష‌యంలో కూడా చాలా బిజీగా అంతే చురుగ్గా అడుగులు ముందుకువేస్తున్నారు. ఇక గ‌తంలో మ‌హేష్ మ‌ల్టీస్టార‌ర్‌గా వెంక‌టేష్‌తో క‌లిసి సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు లో న‌టించిన విష‌యం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయ‌న అనిల్‌రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఎఫ్‌3 లో మ‌హేష్ మ‌ళ్ళీ వెంక‌టేష్‌తో క‌లిసి న‌టించ‌నున్నార‌ని స‌మాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: