టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో లకు కొదవలేదు కొత్త డైరెక్టర్లు కొదవలేదు సినిమాలకు కొదువ లేదు అందుకే ప్రేక్షకులకు ఎప్పుడు ప్రతివారం ఎంటర్టైన్మెంట్ దొరుకుతూనే ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు చిన్న సినిమాలు విడుదలై సంచలన విజయం సాధిస్తే... కొన్నిసార్లు స్టార్ హీరోల సినిమాలు విడుదలై  ఎంతో ఎంటర్ టైన్మెంట్ పంచుతూ ఉంటాయి.దీంతో  ప్రేక్షకులకు మాత్రం ఎంటర్టైన్మెంట్ ఎక్కడా కొదువ ఉండదు. మరి ఈ వారం మొత్తం హాట్ టాపిక్ గా నిలిచిన మూవీస్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం రండి. ముందుగా జాను మూవీ... శర్వానంద్ సమంత జంటగా నటించిన జాను  మూవీ ప్రస్తుతం ఈ వారం హాట్ టాపిక్ గా ఉంది. అంతేకాదు ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ఈ మూవీ ట్రెండ్ గా ఉంది. కన్నడ మూవీ 96 తెలుగు రీమేక్ గా వచ్చిన జాను  మూవీ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. 

 


అద్భుతమైన లవ్ స్టోరీతో  ప్రేక్షకులందరినీ మనసు తాగింది జాను మూవీ. అటు శర్వానంద్ మంచి నటుడు కావడం సమంత  మంచి నటి  కావటంతో...తమ  పాత్రలో తనదైన నటనతో ఆకట్టుకున్నారు. ఇక ముఖ్యంగా శర్వానంద్ ను  సమంత డామినేట్ చేసింది అనే చెప్పాలి. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయి తనదైన నటనతో సమంత ఈ సినిమాలో కూడా అద్భుత నటనతో ప్రశంసలు అందుకుంది. అదే రోజున డిగ్రీ కాలేజ్ అనే ఓ బూతు సినిమా కూడా విడుదలైంది. సినిమా మొత్తం బూతుపురాణమే ఉండడంతో ఈ సినిమా ఎన్నో విమర్శలు ఎదుర్కొంటోంది. ఆ తర్వాత సుడిగాలి సుధీర్ హీరోగా వచ్చిన త్రీ మంకీస్  సినిమా విడుదల అయినప్పటికీ అది ప్రేక్షకులకు చెవిన  కూడా పడకుండానే కనుమరుగైపోయింది. 

 


 అంతేకాకుండా ఆర్ఆర్ఆర్  కు సంబంధించిన ఒక కీలక అప్డేట్ ఈ వారంలోనే వచ్చింది. ఆర్ఆర్ఆర్  సినిమా విడుదల వాయిదా పడుతూ ఉన్నట్లు వచ్చే సంవత్సరం జనవరి 8వ తేదీన ఆర్ఆర్ఆర్  సినిమాని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. రాజమౌళి సినిమా వాయిదా పడుతుందా సరైన సమయానికి విడుదల అవుతుందా అని అయోమయం లో ఉన్న అభిమానులందరికీ ఒక క్లారిటీ వచ్చేసినట్లు అయ్యింది. అయితే ఈ అప్ డేట్ చూసి ఈ సినిమాలో నటిస్తున్న హీరోల అభిమానులు నిరాశ చెందితే  పలువురు అభిమానులు మాత్రం ఇప్పటికైనా సరైన డేట్ ఫిక్స్ అయింది అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వారం మొత్తం హాట్ టాపిక్గా సినీ ఇండస్ట్రీలో టాపిక్స్ నిలిచాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: