భారతీయ చలన చిత్ర రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్న నటుడు సూపర్ స్టార్ రజినీకాంత్.  ఒక సామాన్యమైన కండెక్టర్ గా ఉన్న ఆయన ప్రపంచం మెచ్చిన సూపర్ స్టార్ గా ఎదిగారు.  రజినీ కాంత్ తెరపై కనిపిస్తే చాలు ఫ్యాన్స్ కి పూనకాలే.. ఆయన నడక, జుట్టు ఎగురవేయడం, సిగరెట్ గాల్లో విసిరి అందుకోవడం.. కళ్లద్దాలు స్టైల్ గా పెట్టుకోవడం.. ఒక్కటేమిటి రజినీ కాంత్ ఒక స్టైల్ కి ఐకన్ గా ఉండేవారు.  అందుకే ఆయన్ని అనుకరించే యూత్ ఎంతో మంది ఉన్నారు.  ఆయన డైలాగ్స్ పవర్ ఫుల్ పంచ్ ల్లా పేలుతాయి.  తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు రజినీకాంత్.  అయితే గత కొంత కాలంగా ఆయన నటిస్తున్న సినిమాలు పెద్దగా ఆడటం లేదు.. లింగ మొదలు కొని ఒక్క పెట్టా తప్ప మొన్న రిలీజ్ అయిన దర్బార్ కూడా నష్టాలే తెచ్చిపెట్టాయని అంటారు.  అయితే ఆ మద్య రజినీకాంత్ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారని అన్నారు.

 

  ఆ సమయంలో ఆయన ఒక్కటే చెప్పారు.. దేవుడు ఆదేశిస్తే నేను అదే పని చేస్తాను అని.. ఇప్పుడు ఆయన పూర్తి రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నట్లు కోలీవుడ్ టాక్.  అంతే కాదు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్న రజనీకాంత్, అధికార పీఠాన్ని దక్కించుకోవాలంటే, పాదయాత్ర ఒక్కటే మార్గమని భావిస్తున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్ ల మాదిరిగానే రజనీకాంత్ కూడా నడుస్తూ, రాష్ట్రమంతా చుట్టి రావాలని భావిస్తున్నట్టు సమాచారం.

 

ఇలా చేస్తే తన అభిమానులే కాదు ప్రజల మనసు కూడా గెల్చుకోవొచ్చు అన్న అభిప్రాయంలో ఆయన ఉన్నట్లు సమాచారం. ఈ పాదయాత్రలో పలువురు అన్నాడీఎంకే నేతలు రజనీ పెట్టబోయే పార్టీలో చేరుతారని కూడా తెలుస్తోంది. ఆగస్టు నుంచి పాదయాత్ర ఉంటుందని, ఇందులో భాగంగా అన్ని జిల్లాలనూ కలుపుతూ కనీసం 4 వేల కిలోమీటర్ల రూట్ మ్యాప్ ను తయారు చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. మరి రాజకీయ ఎంట్రీ ఏ రేంజ్ లో చేస్తారో చూడాలి రజినీకాంత్. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: