తమిళ స్టార్ హీరో విజయ్ పై ఇన్కంటాక్స్ అధికారుల దాడులు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. గత మూడేళ్ల క్రితం విజయ్ పై ఇన్కమ్ టాక్స్ అధికారులు దాడులు చేయగా తాజాగా మరోసారి విజయ్ పై  ఇన్కమ్ టాక్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. కాగా  విజయ్ ప్రస్తుతం మాస్టర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఐటీ అధికారులు అక్కడికి చేరుకొని ఐదు గంటల పాటు విచారించారు. ఇక ఆ తర్వాత విజయ ఇంట్లో కూడా ఐటీ శాఖ అధికారులు విచారణ జరిపారు. అయితే ఈ సందర్భంగా రెండు రోజుల వరకు సినిమా షూటింగ్ కి కాస్త గ్యాప్ తీసుకున్న విజయ్ తాజాగా మాస్టర్ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. 

 


 కాగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రచ్చరచ్చగా మారిపోయింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ నైవేలి లోని ఎన్ఎల్సీ  సొరంగం వద్ద జరుగుతోంది. అయితే ఇక్కడ షూటింగ్ జరుపటాన్ని  వ్యతిరేకిస్తూ బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు.? ఇక్కడ షూటింగ్ నిర్వహించేందుకు వచ్చిన యూనిట్ తో వివాదానికి దిగారు బిజెపి నేతలు. అంతేకాకుండా చిత్రం షూటింగు అడ్డుకునేందుకు ప్రయత్నించారు ఈ విషయం తెలుసుకున్న విజయ్  అభిమానులు అక్కడికి చేరుకోగా బీజేపీ నేతలకు అభిమానులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం కాస్త గొడవకు దారి తీస్తుంది. దీంతో షూటింగ్ స్పాట్ కాస్త రచ్చ రచ్చగా మారి పోయింది. కాగా ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని ఇరువర్గాలకు నచ్చజెప్పి పంపించేవారు. 

 

 కాగా ఈ ఘటనతో అటు పోలీసులు కూడా విజయ్ షూటింగ్ జరుగుతున్న ప్రాంతంలో భద్రతను పెంచారు . అయితే బిజెపి కావాలనే తమిళ స్టార్ హీరో విజయ్ పై బిజెపి ఇన్కమ్ టాక్స్ సోదాలు నిర్వహించేలా చేస్తోందని బీజేపీ విజయం పై కక్ష కట్టింది అంటూ ఆరోపణలు కూడా వస్తున్న విషయం తెలిసిందే. దీంతో విపక్ష పార్టీ నేతలందరూ విజయ్ కి  మద్దతుగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో రోజురోజుకు హీరో విజయ్ కి విపక్ష పార్టీల మద్దతు పెరుగుతూ వస్తోంది. తమిళ హీరో విజయ్ కి మద్దతుగా నిలుస్తున్న విపక్ష పార్టీల నేతలు బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే విజయ్ పై ఇన్కమ్ టాక్స్ సోదాలు బిజెపి చేపడుతుంది అంటూ విమర్శిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: