కుమారి 21f  సినిమాతో కుర్రాళ్ళను డిస్టర్బ్ చేసిన హెబ్బా పటేల్ ఆ సినిమాతో వచ్చిన క్రేజ్ క్యాష్ చేసుకోలేకపోయింది. అడపాదడపా సినిమాలైతే చేస్తుంది కాని ఆశించిన స్థాయిలో మాత్రం రిజల్ట్ అందుకోలేదు. ప్రస్తుతం ఒకటి రెండు సినిమాల్లో అవకాశాలు అందుకున్న హెబ్బా పటేల్ లేటెస్ట్ ఫోటో షూట్ తో సర్ ప్రైజ్ చేసింది. 

 

రెడ్ డ్రెస్ లో అమ్మడు అందాల ప్రదర్శన అబ్బో అనిపిస్తుంది. కొద్దిగా ఒళ్ళు చేసినట్టు అనిపిస్తున్న హెబ్బా తన అందాలతో మరోసారి అందరిని తనవైపు తిప్పుకుంది. కరెక్ట్ సినిమా పడాలే కాని తన సత్తా చాటుతానని హింట్ ఇస్తున్న హెబ్బా చూస్తుంటే ఈసారి పక్కా అలాంటి ఆఫర్ కొట్టేసేలా ఉంది. గ్లామర్ షో కి ఏమాత్రం అడ్డు చెప్పని ఈ అమ్మడు మంచి అవకాశం కోసం చూస్తుంది. అల్లు అరవింద్ ఆహా OTT లాంచింగ్ లో హెబ్బా తళుక్కున మెరిసింది. రెడ్ డ్రెస్ లో హెబ్బా ని చూసి అందరు నోరెళ్లబెట్టారు. 

 

హెబ్బా కూడా సినిమా ఛాన్సులు రావడం లేదని వెబ్ సీరీస్ ల మీద దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఒక వెబ్ సీరీస్ లో నటిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే అది ఎలాంటి కాన్సెప్ట్ అన్నది తెలియదు. మొత్తానికి ఎలాంటి చిన్న అవకాశం వచ్చినా తన మార్క్ చూపించాలని తాపత్రయపడుతున్న హెబ్బా కెరియర్ ఇక మీదట అయినా గాడిలో పడుతుందేమో చూడాలి. మరి ఈ అమ్మడికి కరెక్ట్ ఛాన్స్ ఎప్పుడు వస్తుందో చూడాలి. ఆహా OTT లాంచింగ్ లో హెబ్బా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. మరి ఇంత కష్టపడినా సరే తన ఈ అందాల ప్రదర్శని ఏ దర్శకుడైన గుర్తిస్తాడో లేదో చూడాలి. హెబ్బా మాత్రం మళ్ళీ కుమారి లాంటి కథ కోసం వెయిట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అదే జరిగితే అమ్మడికి మళ్లీ మంచి రోజులు వచ్చినట్టే. 

మరింత సమాచారం తెలుసుకోండి: