పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వివివినాయక్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ మూవీతో టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చారు.  చిరంజీవిని వెండి తెరపై మరోసారి కళ్లారా చూసిన అభిమానులు బాస్ ఈజ్ బ్యాక్ అంటూ తెగ సంబరాలు చేసుకున్నారు.  మొదటి సినిమా మంచి కాన్సెప్ట్ తో ఉండాలని కోలీవుడ్ లో స్టార్ హీరో విజయ్ నటించిన ‘కత్తి’ మూవీని రిమేక్ గా అచ్చమైన తెలుగు నేటివిటికి తగ్గట్టు తీశారు.  ఈ మూవీ విషయంలో మెగాస్టార్ చిరంజీవి చాలా జాగ్రత్తలు తీసుకొని ప్రత్యేకంగా తాను కూడా సినిమాపై వర్క్ చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. 

 

మూవీ కొణిదెల ప్రొడక్షన్ లో రూపొందింది.  మొత్తానికి సినిమా సూపర్ హిట్ టాక్ రావడం.. రూ.150 కోట్ల క్లబ్ లో చేరడం జరిగిపోయింది.  ఇదే జోష్ తో మెగాస్టర్ చిరంజీవి గతంతో రామ్ చరణ్ ధృవ లాంటి బ్లాక్ బస్టర్ అందించిన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒకప్పుడు తెలుగు స్వాతంత్ర సమరపోరాట యోధుకడు.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పదిహేనేళ్ల క్రితం చిరంజీవి చేయాలని భావించినా అప్పట్లో బడ్జెట్ విషయంలో ఎవరూ సాహసం చేయలేక ఆగిపోయిందట. 

 

కానీ చిరంజీవికి మాత్రం ఈ చిత్రం చేయాలని మనసులో కోరికగానే ఉండేదట. దాంతో ఆయన తనయుడు రామ్ చరణ్ ఈ చిత్రం చేసేందుకు ముందుకు రావడం.. రూ. 300 కోట్లకు పైగా ఖర్చు చేయడం జరిగిందట. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కించారు.  తెలుగు, మళియాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని తీశారు.  అంతే కాదు ఈ చిత్రం కోసం అన్ని సినీ పరిశ్రమల్లోకి వెళ్లి తమదైన ప్రమోషన్ చేశారు.  కానీ ఈ చిత్రం అనుకున్న విజయం అందుకోలేపోయింది.  ప్రస్తుతం చిరంజీవి స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఆ చిత్రం షూటింగ్ శరేవేగంగా జరుగుతోంది. ఇక చిత్రానికి ఆచార్య అనే టైటిల్ ని సెట్ చేసిన విషయం తెలిసిందే.  ఈ చిత్రం దసరా కానుకగా తీసుకు రావాలని.. అదీ కూడా సెలవలకు ముందే ప్లాన్ చేయాలని భావిస్తున్నారట.  కొణిదెల ప్రొడక్షన్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇక  చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: