టాలీవుడ్ లోకి మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అల్లు అర్జున్.  దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన గంగోత్రి మూవీతో హీరోగా పరిచయం అయిన అల్లు అర్జున్ తర్వాత దేశముదురు, బన్ని, ఆర్య లాంటి మూవీస్ లో యాక్షన్, లవ్, కామెడీ తనదైన దూకుడు చూపించారు.  మెగా హీరో అంటే ఇలా ఉండాలి అన్న విధంగా అల్లు అర్జున్ తన స్టైల్ తో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు.  అందుకే ఆయన్ని అభిమానులు స్టైలిష్ స్టార్ అంటారు.  సుకుమార్ దర్శకత్వంలో ఆర్య అప్పట్లో బిగ్గెస్ట్ హిట్ సినిమాగా మంచి విజయం అందుకుంది.

 

దాంతో ఆ మూవీ సీక్వెల్ గా ఆర్య 2 సినిమా తీశారు. కానీ ఈ మూవీ అనకున్న స్థాయిలో ఫలితం రాబట్టలేక పోయింది.  కాకపోతే మ్యూజికల్ హిట్ గా నిలిచింది.  దాంతో సుకుమార్ - బన్నీ మద్య చాలా గ్యాప్ వచ్చింది.  ఈ మద్య లో సుకుమార్ ఎన్నో కథలు వినిపించినా.. అవి ఏవీ బన్నీకి నచ్చకపోవడంతో వీరి కాంబినేషన్ పెండింగ్ పడుతూ వచ్చింది.  ఇక నాపేరు సూర్య డిజాస్టర్ తర్వాత బన్నీ రెండేళ్లు గ్యాప్ తీసుకున్నారు.  ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు ఏదో ఒక సమాధానం చెబుతూ.. వచ్చాడు.  దానికి కారణం ఈ సారి కొడితే ఏనుకు కుంభస్థలం కొట్టాలని చెప్పేవారు బన్ని. 

 

గతంలో తనకు జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి హిట్ సినిమాలు అందించిన త్రివిక్రమ్ నే నమ్ముకున్నాడు.  వీరిద్దరి కాంబినేషన్ లో ఈ సంక్రాంతి కానుకగా ‘అల వైకుంఠపురములో’ మూవీ వచ్చింది.  ఈ మూవీ మొదటి నుంచి భారీ అంచనాలే పెంచుకుంటూ వచ్చింది. ముఖ్యంగా ఇందులో పాటలు సామజవరగమన, రాములో రాముల సినిమా స్థాయిని మరింత పెంచాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ గతంలో తనకు ఆర్యలాంటి హిట్ ఇచ్చిన సుకుమార్ దర్శకత్వంలో సినిమాలో నటిస్తున్నారు. సుకుమార్ ది ప్రత్యేకమైన శైలి. ప్రతి షాట్ లో - ప్రతి సన్నివేశంలో - ప్రతి డైలాగ్ లో - ప్రతి పాటలో - ప్రతి ఫైట్ లో ఏదో ప్రత్యేకకత చూపించాలని తపించే దర్శకుడాయన.  ఆ మద్య రామ్ చరణ్ తో తీసిన రంగస్థలం ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో తెలిసిందే.  మరి ఈసారి అల్లు అర్జున్ కి ఆర్య లాంటి హిట్ ఇస్తాడా.. ఆర్య2 లా ఫ్లాప్ ఇస్తారా అన్నది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: