స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం అలా వైకుంఠపురములో. ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య విడుదలై ప్రేక్షకుల అంచనాలను సంతృప్తి పరుస్తూ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలైన తర్వాత రికార్డు సృష్టించడమే కాదు.. విడుదలకు ముందే పాటలతో  కూడా సంచలన రికార్డు సృష్టించింది. ఈ సినిమా నుంచి విడుదలైన సామజవరగమనా పాట అయితే యూట్యూబ్ ని షేక్ చేసి రికార్డును సృష్టించిన విషయం తెలిసిందే. అయితే అలా వైకుంఠపురములో సామజ వర గమన పాట ఎలా పుట్టుకొచ్చింది అనేదానిపై సీతారామశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహిళలోని బాహ్య సౌందర్యాన్ని కాకుండా దైవత్వాన్ని మాత్రమే చూడాలన్నది నా లక్ష్యం అంటూ సీతారామ శాస్త్రి తెలిపారు. పాట రాసేటప్పుడు ప్రతి చిన్న విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచిస్తాను... సామజ వర గమన పాటలోని సాహిత్యాన్ని కొంచెం లోతుగా చూస్తే ఒక పాపాయిని చూస్తున్నట్లుగా ఉంటుంది. 

 

 మంజుల హాసమ...  మల్లెల మాసమ..  విరిసిన పింఛమ..  విరుల ప్రపంచం అనే పదాలు సౌకుమార్యం తో ఉంటాయి అంటూ సీతారామశాస్త్రి తెలిపారు. నీ కళ్ళను పట్టుకు వదలనన్నది చూడే నా కళ్ళు    అన్నప్పుడు పట్టీలు పెట్టుకుంటున్న మనవరాలి వెనుక నేను పరుగెడుతూ ఉన్నట్లు నాకు భావన కలిగింది. ఈ పదాలు అంతర్లీనంగా అర్థం కూడా వస్తుంది. నా ఊపిరి గాలికి ఉయ్యాలలో  ఊగుతూ ఉంటే ముంగురులు ... నువ్వు నెట్టేస్తే  ఎలా నీట్టూర్చవటే  నిష్టారావు  విలువలు... అంటే నా వల్లే నీ లో ఈ చేష్టలు  జరుగుతున్నవి .. నడుచుకుంటూ వస్తున్నప్పుడు తొక్కేసిన ట్టుగా అనిపిస్తుంది. అంటూ సీతారామశాస్త్రి ఈ పాట పుట్టడానికి అసలైన అర్థం చెప్పారు. 

 

 అయితే సీతారామశాస్త్రి రాసిన సామజవరగమనా పాట ఎంత విజయం సాధించిందో తెలిసిన విషయమే. సినిమా విడుదలై  ఇన్ని రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికి తెలుగు ప్రేక్షకుల నోళ్ళలో సామజవరగమనా పాట నానుతూనే ఉంది. ఇక సీతారామశాస్త్రి ఏదైనా పాట రాస్తున్నాడు అంటే ఆ పాటలో ఎన్నో అద్భుత అర్థాలతో కూడినవి గా ఉంటాయి అన్న విషయం తెలిసిందే. సీతారామశాస్త్రి రాసిన పాట కు సరైన సింగర్ తోడైతే సామజవరగమనా లాంటి పాటలు వస్తాయి అన్నది ప్రేక్షకుడి భావన.

మరింత సమాచారం తెలుసుకోండి: