మొన్నీమధ్య త్రివిక్రం అల వైకుంఠపురములో ఈవెంట్ లో మనసుకి దురద పుడితే గోక్కునే దువ్వెనే సంగీతమని చెప్పినట్టుగా.. ప్రతి వారం రిలీజ్ అయ్యే సినిమాల సాంగ్స్ ప్రేక్షకులను అలరిస్తుంటాయి. రిలీజైన సినిమాలు.. రిలీజ్ కాబోతున్న సినిమాలు ఇలా పాటని ప్రేమించడం ఆ పాటని ఆరాధించడం ప్రేక్షకుల వంతు. విని వదిలేసే సాంగ్ లా కాకుండా మనసులో దాచుకునే పాటలు వస్తుంటాయి. ఇక ఈ వారం అలాంటి పాట జాను సినిమాలోని ఊహలే ఊహలే. కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన 96 మూవీ రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం రిలీజైంది.

 

అక్కడ విజయ్ సేతుపతి, త్రిష నటించిన ఈ సినిమా రీమేక్ జానులో శర్వానంద్, సమంత నటించారు. మాత్రుక దర్శకుడు ప్రేం కుమార్ తెలుగు సినిమాను తెరకెక్కించాడు. దిల్ రాజు బ్యానర్ లో ఈ సినిమా నిర్మించారు. తమిళ సినిమాకు మ్యూజిక్ అందించిన గోవింద్ వసంత తెలుగు జానుకి అద్భుతమైన మ్యూజిక్ అందించాడు. జాను సినిమా నుండి ఊహలే ఊహలే సాంగ్ ఈ వారం ప్రేక్షకుల హృదయాలను గెలిచింది. 

 

తమిళంలో ఆల్రెడీ కాదలే కాదలే సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. అలానే తెలుగులో జాను నుండి వచ్చిన ఊహలే ఊహలే సాంగ్ కూడా సూపర్ హిట్ అయ్యింది. ఈ వారం టాప్ ప్లేస్ లో ఉన్న ఊహలే ఊహలే సాంగ్ సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది. శర్వానంద్, సమంత అదరగొడుతున్నారు.. మొత్తానికి జాను రీమేక్ గా వచ్చినా మ్యూజిక్ మాత్రం అదిరిపోయింది. జాను సినిమాకు మ్యూజిక్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. సాంగ్స్ మాత్రమే కాదు బిజిఎం కూడా అలరించింది. జాను మ్యూజిక్ అందించిన గోవింద్ వసంతకు తెలుగులో కూడా మంచి అవకాశాలు వచ్చేలా ఉన్నాయి. జాను సినిమాతో అటు శర్వానంద్, సమంతలు తమ కెరియర్ లో మంచి హిట్ అందుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: