పెళ్లికి ముందు కమర్షియల్, గ్లామర్ రోల్స్‌ మాత్రమే చేసిన సమంత, పెళ్లి తరువాత పూర్తిగా ట్రెండ్ మార్చేసింది. ఎక్కువగా పర్ఫామెన్స్‌కు స్కోప్‌ ఉన్న రోల్స్‌ మాత్రమే చేస్తూ నటిగా మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ఓ బేబీ, మజిలీ, రంగస్థలం లాంటి సినిమాలతో నటిగా తానేంటో ప్రూవ్‌ చేసుకున్న సామ్‌, తాజాగా జాను సినిమాతో మరోసారి సత్తా చాటింది. రీమేక్‌ సినిమా అయినా తనదైన ముద్ర వేయటంలో సక్సెస్‌ అయ్యింది సమంత.


తమిళ్‌లో ఘనవిజయం సాధించిన 96 సినిమాను తెలుగులో జాను పేరుతో రీమేక్‌ చేశారు. ఒరిజినల్‌ వర్షన్‌కు దర్శకత్వం వహించిన ప్రేమ్‌కుమార్‌ ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించాడు. ప్యూర్‌ మెచ్యూర్డ్‌ లవ్‌ స్టోరిగా తెరకెక్కిన ఈ సినిమాను రియలిస్టిక్‌ వేలో రూపొందించారు. అందుకు తగ్గట్టుగా అనవసరపు హంగులు ఆర్భాటాలు లేకుండా రూపొందించారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్‌ వార్త ఒకటి మీడియా సర్కిల్స్‌లో హల్‌చల్ చేస్తోంది.


ఈ సినిమాలో సమంత కేవలం మూడు కాస్ట్యూమ్స్‌ మాత్రమే వాడింది. ఎక్కువ భాగం ఫ్యాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్స్ కావటంతో సమంత స్క్రీన్‌ స్పేస్‌ కాస్త తక్కువే. ఇంటర్వెల్ బ్యాంగ్‌కు కొద్ది సేపు ముందే సమంత ఎంట్రీ ఇస్తుంది. దీంతో ఎక్కువగా కాస్ట్యూమ్స్‌ చేంజ్ చేసే అవకాశం రాలేదు. పేరుకు మూడు కాస్ట్యూమ్స్ అని చెప్పిన సినిమా అంతా దాదాపు ఒకే డ్రెస్‌లో కనిపిస్తుంది సామ్‌. అలా సినిమా అంతా ఒకే లుక్‌లో కనిపించినా ఏ మాత్రం బోర్ అనిపించకుండా మెప్పించటంలో సక్సెస్‌ అయ్యింది సమంత.


ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో సమంతకు జోడిగా శర్వానంద్ నటించాడు. దిల్ రాజు బ్యానర్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు తొలి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. అంతేకాదు సినిమాలో శర్వానంద్‌, సమంతలు అద్బుతమైన నటనతో ఆకట్టుకున్నారన్న పేరు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: