డైరక్టర్ హీరో కాంబినేషన్ సూపర్ హిట్ అని విన్నాం.. హీరో, హీరోయిన్ హిట్టు కాంబినేషన్ విన్నాం కాని డైరక్టర్ హీరోయిన్ హిట్ కాంబో గురించి ఎప్పుడైనా విన్నారా అదేంటి ఇది కొత్తగా ఉందనుకోవచ్చు. ఇది నిజమే 80 దశాబ్ధంలో ఈ కాంబినేషన్ కు సూపర్ క్రేజ్ ఉండేది. క్రియేటివ్ డైరక్టర్ క్రేజీ హీరోయిన్ అంటే చాలు సినిమా ఎలా ఉన్నా ఆమె పాత్ర మాత్రం అదరగొడుతుంది అనేలా సినిమాలు తీశారు. అయితే ప్రస్తుత కాలంలో అలాంటి డైరక్టర్ హీరోయిన్ కాంబినేషన్ ఒకటి క్రేజీగా మారింది. అంతకుముందు వరకు ఒక్క హిట్టు లేక కెరియర్ అటు ఇటుగా ఉన్న పూజా హెగ్దెకి డిజే అంటూ అదిరిపోయే హిట్ ఇచ్చాడు డైరక్టర్ హరీష్ శంకర్.

 

దువ్వాడ జగన్నాథం ముందు పూజాని పట్టించుకునే వారే లేరు ఆ తర్వాత అమ్మడు వరుస స్టార్ సినిమాలు చేస్తూ వచ్చింది. ముందు బన్నితో మొదలు పెట్టిన పూజా హెగ్దె ఎన్.టి.ఆర్, మహేష్, ప్రభాస్ ఇలా అందరి స్టార్స్ తో నటించింది. మధ్యలో వరుణ్ తేజ్ లాంటి యువ హీరో సరసన కూడా నటించింది అమ్మడు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో గద్దలకొండ గణేష్ సినిమాలో జోడీ కట్టింది పూజా హెగ్దే ఆ సినిమాకు దర్శకుడు హరీష్ శంకర్ కావడం విశేషం.

 

ఇలా పూజాకి లక్కీ డైరక్టర్ గా మారాడు హరీష్ శంకర్. అందుకే మళ్లీ ఇప్పుడు ఆమెకు మరో ఛాన్స్ ఇస్తున్నాడట. ప్రస్తుతం సూపర్ ఫాం లో ఉన్న పూజాని సినిమాలో పెడితే సినిమాకు స్పెషల్ క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. ఇక హరీష్ శంకర్ పవర్ స్టార్ పవన్ కాంబినేషన్ లో వచ్చే సినిమాలో హీరోయిన్ గా కూడా పూజా హెగ్దెని తీసుకునే ఆలోచనలో ఉన్నారట. అదే జరిగితే హీరో హీరోయిన్ కాంబో కన్నా డైరక్టర్ హీరోయిన్ కాంబోపైనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. డిజేలో బికినితో, గద్దలకొండ గణేష్ లో హాఫ్ సారీతో పూజా కెరియర్ కు మంచి బూస్టప్ ఇచ్చే సినిమాలు చేసిన హరీష్ పవర్ స్టార్ సినిమాతో ఆమెకు మరింత క్రేజ్ తెచ్చిపెడతాడని ఆశిద్దాం. అయితే ఆమెలోని టాలెంట్ చూసి అవకాశాలు ఇస్తున్నా కొంతమంది మాత్రం ఆ హీరోయిన్ పై హరీష్ స్పెషల్ ఇంట్రెస్ట్ దేనికో.. పూజాని వదలకుండా సినిమాలు చేయవా హరీష్ శంకర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: