తెలుగు సినీ పరిశ్రమలో ప్రెజెంట్ జేనరేషన్ స్టార్ హీరోలతో పాటు సీనియర్ స్టార్ హీరోలు కూడా బిజీ బిజీగా ఉన్నారు. తమ తమ కమిట్ మెంట్స్ తో సినిమాలు చేసుకుంటూ లైన్లో ఉన్నారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్.. ఇలా స్టార్ హీరోలంతా ఈ ఏడాది షూటింగులతో బిజీగా ఉన్నారు. 2021లో వీరందరూ తమ సినిమాలతో సందడి చేయనున్నారు. ఇప్పుడున్న హీరోల కమిట్ మెంట్స్ తో వచ్చే ఏడాది సినిమా క్యాలెండర్ ఇయర్ ఫుల్ బిజీ కానుంది.

 

 

ఈ ఏడాది చిరంజీవి 152వ సినిమా, వెంకటేష్ నారప్ప, బాలకృష్ణ - బోయపాటి సినిమాలు రానున్నాయి. నాగార్జున తెలుగు సినిమా లేకపోయినా హిందీలో చేసిన బ్రహ్మాస్త్ర ద్వారా రానున్నాడు. పవన్ వకీల్ సాబ్, రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవి 152లో కనించబోతున్నాడని టాక్. మహేశ్ సినిమా సంక్రాంతికి అనుకున్నా ఆర్ఆర్ఆర్ రిలీజ్ నేపథ్యంలో ఎప్పుడొస్తాడో తెలీని పరిస్థితి. ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్.. మాత్రం ఖచ్చితంగా ఈ ఏడాదిలో వచ్చే అవకాశం లేదు. వీరి సినిమాలు వచ్చే ఏడాదే వస్తాయి. చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్, పవన్, రామ్ చరణ్ సినిమాలు ఈ ఏడాదితో పాటు వచ్చే ఏడాది కూడా ఉన్నాయి. 

 


ఈరకంగా చూస్తే 2021 తెలుగు సినిమా ప్రేక్షకులకు మన పది మంది స్టార్ హీరోల సినిమాలతో ఖుషీ కాబోతున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు కూడా ఇది ఎంతో శుభ పరిణామం. అందరి సినిమాలతో థియేటర్లు కళకళలాడతాయి. ఏగ్జిబిటర్లకు బిజినెస్ బాగుంటుంది. హీరోల అభిమానులు, ప్రేక్షకులకు కూడా సంతోషాన్నిచ్చే విషయం. సక్సెస్ రేట్ కూడా ఇదేవిధంగా ఉంటే వచ్చే ఏడాది తెలుగు సినీ పరిశ్రమ కళకళలాడటం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: