ఆర్ఆర్ఆర్సినిమా కోసం ఎదురు చూడని తెలుగు ప్రేక్షకుడు లేడు.. ఎందుకంటే అక్కడ ఒక హీరో కాదు ఇద్దరు స్టార్ హీరోలు.. దర్శకుడు మాములు దర్శకుడు కాదు.. దర్శకులు అందరి రాజు. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా స్టార్ హీరోలు యాంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. 

 

అయితే ఈ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఏ ఒక్క అప్డేట్ వచ్చిన చాలు ట్విట్టర్ లో పోస్ట్ చేసి ట్రెండ్ అయ్యేలా చేసి పండుగ చేసుకుంటున్నారు. ఇంకా ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సూపర్ అప్డేట్స్ ఈ వారంలో వచ్చాయి. 

 

అయితే అవి ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం. ఈ సినిమా విడుదల తేదిని వాయిదా వేశారు.. జులై చివరిలో వస్తుంది అనుకున్న ఈ సినిమా దసరాకు అన్నారు. కానీ చివరికి దసరాకు కూడా రాకపోగా వచ్చే సంక్రాంతికి వస్తుంది. 2021 జనవరి 8కి ఈ ఆర్ఆర్ఆర్ సినిమాను పోస్ట్ ఫోన్ చేశారు. దీంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. 

 

అయితే ఆలా నిరాశకు గురైన అభిమానులకు ఆశలు పెంచేందుకు మరో అద్భుతమైన అప్డేట్ తెరపైకి వచ్చింది. అది ఏంటి అంటే.. మాములుగా ఈ సినిమాలో ఒక్క తెలుగు వారే కాదు.. హాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అందరి సూపర్ స్టార్లు ఈ సినిమలో నటిస్తున్నారు. అయితే వాళ్లలో బాలీవుడ్ నుండి ఈ చిత్రంలో అజ‌య్ దేవ‌గ‌న్ బ్రిటీష్ పోలీస్ అధికారిగా ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నార‌ట‌. ఈ విషయం తెలుసుకున్న అభిమానుల సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. 

 

అయితే ఇలా అభిమానులకు నిరాశ పరుస్తున్న సరే.. ఆర్ఆర్ఆర్ బిజినెస్ ఏ మాత్రం తగ్గటం లేదు.. ఈ చిత్రానికి బడ్జెట్ దాదాపు 400 కోట్లు 10 భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. అలాంటి ఈ చిత్రానికి విడుదలకు ముందే నిర్మాతకు డబల్ ప్రాఫిట్స్ తో సినిమాను అమ్మాలని చూస్తున్నారు. 

 

అందుకు తగ్గట్లే సినిమా బయ్యర్లు కూడా రేటు ఎంతంటే అంత వెనకాడకుండా పెట్టడానికి సిద్ధం అయిపోయారు.. అయితే తాజా సమాచారం ప్రకారం నిర్మాత దిల్ రాజు నైజాం వాటాకు 75కోట్లకు దక్కించుకోగా, కర్ణాటకలో ఏషియన్ వారాహిలు 50కోట్లకు దక్కించుకున్నారు. ఇక సీడెడ్ లో వారాహి 40 కోట్లు, వైజాగ్ లో వారాహి 30కోట్లతో దక్కించుకున్నట్లు సమాచారం. ఇంకా సినిమా రిలీజ్ కు సంవత్సరం ఉంది అనగానే ఇంత ఇంత కొంటున్నారు అంటే ఆర్ఆర్ఆర్ సినిమా రేంజ్ ఏంటో అర్థం చేసుకోవాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: