మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన గొప్ప మనసు ని చాటుకొని నెటిజన్లను ఫిదా చేస్తున్నాడు. గతంలో మెగా ఫ్యామిలీకి వీరాభిమాని, ఇంకా హైదరాబాద్ మెగా ఫ్యాన్స్ అధ్యక్షుడు అయిన నూర్ మహమ్మద్ గుండెపోటుతో మరణించారు. ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ వీరాభిమాని నూర్ భాయ్ ఇంటికి చేరుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆ సందర్భంలోనే రామ్ చరణ్ వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అలాగే రూ.10 లక్షలను విరాళంగా ఇస్తానని నూర్ కుటుంబానికి హామీ ఇచ్చారు. 

 

Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=RAM POTHINENI' target='_blank' title='రామ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రామ్</a> చరణ్

 


అయితే తాజాగా నూర్ భార్య, పిల్లలను తన ఇంటికి పిలిపించుకున్న రామ్ చరణ్.. వారికి రూ. 10 లక్షల చెక్కులను అందించి తాను ఇచ్చిన మాటలను నిలబెట్టుకున్నాడు. అలాగే వారి యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నాడు. గొప్ప అభిమానిగా తమ కుటుంబంపై ఎంతో ప్రేమ ను చూపిస్తూ... ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టిన నూర్ మహమ్మద్ కు తన కుటుంబానికి ఎప్పటికీ రుణపడి ఉంటానని రామ్ చరణ్ ఈ సందర్భంగా తెలియపరిచాడు. నూర్ కుమారుడికి తప్పకుండా ఒక మంచి ఉద్యోగం ఇప్పిస్తానని.. కూతుర్ల పెళ్లిళ్లకు తప్పకుండా వస్తానని ఈ సందర్భంగా మళ్లీ హామీ ఇచ్చాడు రామ్ చరణ్. 

 

1


తన వీరాభిమాని పై రామ్ చరణ్ చూపించిన ఆప్యాయతను నెటిజన్లు బాగా ప్రశంసిస్తున్నారు. దట్ ఇస్ రామ్ చరణ్ అంటూ తమ ఫేవరెట్ హీరో ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.  ఏది  ఏదేమైనా రామ్ చరణ్ చేసిన ఈ ఆర్థిక సాయం, ఇంకా భవిష్యత్తులో తమకి అండగా ఉంటానని హామీ ఇవ్వడం.. స్వర్గస్తుడైన నూర్ ని సంతోష పరుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: