అస‌లే చాలా కాలం నుంచి సినిమాలు లేక చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు హీరో శ‌ర్వానంద్‌. ఒక‌వేళ సినిమాలు తీసినా ఈ మ‌ధ్య వ‌చ్చిన త‌న సినిమాలేవీ హిట్ అయిన దాఖ‌లాలు లేవ‌నే చెప్పాలి. అస‌లే ఫ్లాప‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న శ‌ర్వాకి జాను చిత్రం కాస్త ఊర‌ట‌నిచ్చింద‌నే చెప్పాలి. ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక దీంతో శ‌ర్వా హిట్ కొట్టేశాన‌ని సంబ‌రాలు చేసుకుంటున్నాడు. ఇక ఇదిలా ఉండ‌గా ఈ చిత్రం ఓవ‌ర్సీస్‌లో మాత్రం  జాను చిత్రాన్ని కొనుగోలు చేసిన బయ్యర్లకు కష్టాలు తప్పేలా లేవు. ఈ చిత్రం యూఎస్ ప్రీమియర్ లతో 34,168 డాలర్లను వసూళ్లు చేయగా, మొడటి రోజు 34,391 డాలర్లు రాబట్టి బయ్యర్లని ఏడిపిస్తుంది. అయితే రెండో రోజు మాత్రం పర్వాలేదనిపించేలా 50, 861 డాలర్లని రాబట్టింది. అయితే జాను చిత్రం రెండు రోజులకి కలిపి 1,19,000 డాలర్ల గ్రాస్ రాబట్టగా, బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 6,30,000 డాలర్లు వసూల్ చేయాల్సి అవ‌స‌రం ఎంతైనా వుంది.

 


అయితే ఆదివారం వారాంతపు కలెక్షన్లు కాస్త మెరుగుపడిన బయ్యర్లకి మాత్రం నష్టాలు తప్పేలా లేవు అని స‌మాచారం. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే జాను లాంటి క్లాస్ సినిమాలకి ఆదరణ ఎక్కువే అని చెప్పాలి. అంతేకాకుండా సమంత చిత్రాలకు అక్కడ డిమాండ్ కూడా బాగానే ఉంది. అలాంటిది సమంత నటించిన ఈ చిత్రం యూఎస్ వద్ద అతి త‌క్కువ‌ వసూళ్లు రాబడుతూ డిజాస్టర్ దిశగా జానూ చిత్రం ప్రయాణిస్తుంది. 96 లాంటి హిట్ చిత్రానికి రీమేక్ అవ్వడం ఒక నెగటివ్ అని చెప్పాలి. సినిమా లో ఉన్నటువంటి ఎమోషన్ మిస్ అవ్వకూడదనే ఉద్దేశ్యం తో దర్శకుడు తమిళ్ లో తెరకెక్కించినట్లే తెలుగులో తెరకెక్కించడం, 

 

ఇక ఈ చిత్రం డిజిటల్ మీడియా లో తెలుగు ప్రేక్షకులకి అందుబాటుతో ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లే అవకాశం లేకుండా ఉంది. దాంతో సినిమా కి పాజిటివ్ టాక్ వచ్చిన కలెక్షన్లు రాబట్టలేకపోవడం బయ్యర్ల దురదృష్టమనే చెప్పాలి. కానీ ఈ చిత్రంలో ద‌ర్శ‌కుడు ఏమాత్రం ఏ ఒక్క సీన్ ని మార్చినా కూడా సినిమా అస్స‌లు బావుండ‌ద‌ని చూసిన ప్ర‌తి ప్రేక్ష‌కుడికి ఖ‌చ్చితంగా తెలుస్త‌ది. అలాగే త‌మిళ్‌లో చేసింది విజ‌య్‌సేతుప‌తి, త్రిష అయితే తెలుగులో శ‌ర్వా, స‌మంత కాబ‌ట్టి ఒక‌సారి చూడ‌టానికి వెళ్ళొచ్చు. ఎందుకంటే స‌మంత న‌ట‌న‌కి త్రిష‌కి చాలా తేడా ఉంటుంది. ఇందులో శర్వాను మించే యాక్ష‌న్ స‌మంత చేసి ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకుంద‌నే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: