హీరోయిన్ అవ్వాలంటే తరగని అందం ఉండాలంటారు. ఇవే కాకుండా అదనంగా ఎన్నో క్వాలిటీలను లెక్క కడతారు.. కానీ కొందరు హీరోయిన్స్ అందం లేకున్న ఉన్న అందానికి అభినయాన్ని జోడించి సక్సెస్ అయ్యారు. ఇక హీరోయిన్స్ చిన్నప్పుడు ఉన్న అందానికి, పెద్దైయ్యాక వచ్చిన మార్పుల వల్ల కలిగిన అందానికి చాల వ్యత్యాసం ఉంటుంది.. నేటి కాలంలో అందమంటే కంటికి కనిపించేదే అని అందరు అనుకుంటారు. కంటికి అందంగా ఉంటే చాలు లోపల గుణాలు ఎలా ఉన్నా ఆమె కోమలమైనా సౌందర్యానికి దాసోహం అవుతారు.

 

 

ఇకపోతే ఒకప్పుడు ప్రముఖ హీరోయిన్‌గా వెలిగిన నటి కస్తూరి.. ఈమె అన్నమయ్య సినిమాలో ఆన్నమయ్య చిన్న భార్యగా పోషించిన పాత్ర ఎప్పటికి మరపు రాదు.... ఒక మాడ్రన్ నటితో అంత మంచి పాత్రను పోషింపచేసిన దర్శకేంద్రుడిని అభినందించని వారుండరు.. ఇక కస్తూరి ఒకప్పుడు అంటే తన పదో తరగతి వయస్సులో నల్లగా, పొట్టిగా, బక్కగా ఉండేదట. ఇదే కాక పదవతరగతి వరకు ఫ్రెండ్స్‌ కూడా తక్కువేనట.. ఇదే విషయాన్ని వాళ్ల అమ్మ దగ్గరికి వెళ్లి  అమ్మ నాతో ఎవ్వరూ ఉండడం లేదని అడిగితే.. ‘నువ్వు ఎందులోనైనా బెస్ట్‌ అనిపించుకుంటే వాళ్లే నీ దగ్గరకు వస్తారు’ అని చెప్పింది.

 

 

అందుకే చదువు మీద దృష్టి పెట్టా. అప్పటి నుంచి అన్నింట్లోనూ ఫస్టే. ఎలాగూ లుక్స్‌లో లేను, కనీసం చదువులో ఉండాలని..కష్టపడి చదివా.. ఇక నాకు చప్పట్లు వింటే ఎక్కడ లేని కిక్‌ వస్తుంది. అందుకే చదువును కంటిన్యూ చేశా. ఇంటర్‌ కి వచ్చాక పొడవయ్యాను. ఆ తర్వాత డీడీలో యాంకరింగ్‌ చేశాను. అప్పుడు మోడలింగ్‌ ఆఫర్స్‌ వచ్చాయి. అలా మిస్‌ మద్రాస్‌ పోటీలో పాల్గొని కిరీటాన్ని దక్కించుకున్నా.

 

 

ఇకపోతే చిత్ర పరిశ్రమ అంటే నాకు నమ్మకం లేదు. కానీ నాన్నకు తెలిసిన ఒక అంకుల్‌ ‘నన్ను నమ్మి పంపించండి’ అని బతిమిలాడితే పంపించారు. ఒక్క సినిమాతోనే సరిపెట్టేద్దామనుకుని ఇక్కడికి వచ్చిన  నాకు షూటింగ్‌లని  పొద్దున్నే లేవడం.. రాత్రి ఎప్పుడో పడుకోవడం. పైగా డ్యాన్సులు, ఒళ్లు నొప్పులు చిరాకు కలిగింది. కానీ నా మొదటి సినిమా హిట్‌ అని తెలిసి.. అందరూ నన్ను పొగుడుతుంటే అప్పుడు నాకు కిక్ వచ్చింది.. ఒక రకంగా ఆ పొగడ్తలే నన్ను నటిగా నిలబెట్టాయి అని చెప్పుకొచ్చింది కస్తూరి..

మరింత సమాచారం తెలుసుకోండి: