ఫిబ్రవరి 14 కోసం లవర్స్ ఎంతలా ఎదురు చూస్తున్నారో.. రౌడీ ఫ్యాన్స్ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీ కోసం అంతే ఎదురు చూస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. ప్రేమికుల దినోత్సవ కానుకగా ఫిబ్రవరి 14న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీ గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రంలో విజయ్‌కి ఏకంగా నలుగురు లవర్స్ ఉండటంతో కామన్ లవర్స్ కూడా ‘వరల్డ్ ఫేమస్ లవర్’ కోసం ఎదురుచూస్తున్నారు. 

 

తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. ఇది చూసిన తర్వాత మరోసారి విజయ్ పూర్తిగా అర్జున్ రెడ్డి తరహా ప్రేమకథతోనే వస్తున్నాడని అర్థమైపోతుంది. ప్రేమంటే ఒక కాంప్రమైజ్‌కు అర్థం.. ప్రేమంటే సాక్రిఫైజ్.. ప్రేమంటే దైవత్వం ఉంటుంది.. అవేవీ నీకు అర్థం కావంటూ టీజర్‌లో చెప్పిన దర్శకుడు.. ఈ సారి అన్నింటికంటే స్వచ్ఛమైనది ప్రేమ అంటూ ట్రైలర్ మొదలుపెట్టాడు. ఆ తర్వాత వరసగా నలుగురు అమ్మాయిల కారెక్టర్స్ రివీల్ చేస్తూ వెళ్లాడు క్రాంతి మాధవ్. ముఖ్యంగా మధ్యలో చాలాసార్లు అర్జున్ రెడ్డిని గుర్తు చేసాడు విజయ్.

 

క్రాంతిమాధ‌వ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్‌, ఇజా బెల్లా, క్యాథరిన్ త్రెసాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్‌లో కె వల్లభ ఈ చిత్రాన్ని నిర్మించగా.. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానున్నాడు ‘వరల్డ్ ఫేమస్ లవర్’. ఇక ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఆదివారం నాడు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌‌కు భారీ ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ నార్సింగ్‌లో కన్వెన్షన్స్ అండ్ ఎగ్జిబిషన్స్ నందు ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. 

 

ఇప్పటికే రౌడీ ఫ్యాన్స్ ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల నుండి ఈ ఈవెంట్‌కు భారీగా తరలి వస్తున్నారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్లలలో విజయ్ దేవరకొండ స్పీచ్‌ల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తన ఫ్యాన్స్‌ను రెచ్చగొడుతూ సినిమాకి ప్రమోషన్స్ ఎలా రప్పించుకోవాలో అర్జున్ రెడ్డి చిత్రం నుండి బాగా వంటపట్టించుకున్న విజయ్.. ఈ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఏ మాట్లాడతాడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు రౌడీ ఫ్యాన్స్.

 

మరింత సమాచారం తెలుసుకోండి: