ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి బాహుబలి సీరిస్‌ సినిమాల‌తో తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాతరాలు దాటించారు. బాహుబ‌లి సీరిస్ సినిమాల త‌ర్వాత రాజ‌మౌళి డైరెక్ట్ చేస్తోన్న సినిమా ఆర్ ఆర్ ఆర్‌. ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా రాజ‌మౌళి మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కాంబినేష‌న్లో మ‌ల్టీస్టార‌ర్ సెట్ చేయ‌డంతోనే ఒక్క‌సారిగా ఈ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ మీదే అంద‌రి దృష్టి ప‌డింది. 

 

పైగా ఈ సినిమాలో ఇద్ద‌రు టాలీవుడ్ క్రేజీ హీరోలు ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తుండ‌డంతో కూడా ఒక్క‌సారిగా అంద‌రి దృష్టి ఈ సినిమా మీదే ఉంది. చ‌రిత్ర‌లో నిలిచి పోయిన స్వాతంత్య్ర స‌మ‌ర యోధుడు అల్లు రి సీతారామరాజుగా రామ్ చ‌ర‌ణ్‌, ఆదిలాబాద్ గిరిజ‌న గోండు వీరుడు కొమరం భీమ్ గా ఎన్టీఆర్ న‌టిస్తుండ‌డంతో ఈ సినిమా ఎలా ఉంటుందా ? అన్న ఉత్సుక‌త అంద‌రిలోనూ ఒక్క‌టే నెల‌కొంది.

 

మొదటి నుంచీ భారీ అంచనాలున్న ఈ సినిమాని ముందుగా అనుకున్న డేట్‌కు కాకుండా 2021 జనవరి 8న రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ కాంబినేషన్ కి సంక్రాంతి సీజ‌న్ ఉండ‌డంతో ఆర్.ఆర్.ఆర్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా ? అన్న ఆస‌క్తి అంద‌రిలోనూ ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా బిజినెస్ రు. 225 కోట్లు అంటే ఏ రేంజ్ బిజినెస్సో అర్థ‌మ‌వుతోంది.

 

ఇక ఇప్ప‌టి వ‌ర‌కు అత్యధికంగా రు. 122 కోట్ల‌కు అమ్ముడు పోయిన బాహుబలి 2 ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో రు. 198 కోట్ల షేర్ సాధించింది. కానీ ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ బిజినెస్ మొదలవ్వడమే ఆల్ టైం నెంబర్ వన్ లో ఉన్న బాహుబలి 2 షేర్ ని దాటి బిజినెస్ చేస్తోంది. దీనిని బ‌ట్టి మిగిలిన రాష్ట్రాల్లో కూడా క‌లుపుకుంటే ఈ సినిమా బిజినెస్‌... రికార్డుల రేంజ్ ఏంటో అర్థం కావ‌డం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: