మిస్సైల్ మ్యాన్, దివంగత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్ బయోపిక్ రాబోతుంది. జగదీశ్ దానేటి డైరెక్షన్‌లో తెరకెక్కనున్న మూవీలో, కలాం పాత్రను  ప్రముఖ నటుడు అలీ పోషిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ రిలీజ్ చేశారు. 

 

మరో మహానీయుని జీవితచరిత్ర సిల్వర్ స్క్రీన్‌పై మెరవబోతుంది.  మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం బయోపిక్‌ మూవీకి జగదీశ్ దానేటి దర్శకత్వం వహిస్తుండగా.... హాలీవుడ్ నిర్మాత జానీ మార్టిన్ ఈసినిమాకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. పింక్ జాగ్వర్స్ నిర్మాణంలో మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో అబ్దుల్ కలాం పాత్రను హాస్యనటుడు అలీ పోషిస్తున్నారు. సినిమాకు సంబంధించిన ఫస్ట్ పోస్టర్‌ను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ విడుదల చేశారు.

 

ఈ సందర్భంగా చిత్రయూనిట్‌ను జవదేకర్ అభినందించారు. అబ్దుల్ కలాం లాంటి గొప్ప వ్యక్తి సినిమా పోస్టర్‌ను తాను రిలీజ్ చేయడం సంతోషంగా ఉందన్నారు జవదేకర్.  ప్రజల మనసు గెలుచుకున్న గొప్ప వ్యక్తి అబ్దుల్ కలామని జవదేకర్ అన్నారు. కలాం బయోపిక్‌లో నటించే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు నటుడు అలీ. అబ్దుల్ కలాంతో కలిసి ఫొటో దిగాలనుకున్నానని.. కానీ, అది సాధ్యం కాలేదని అలీ తెలిపారు. అలీతో పాటు  దర్శక, నిర్మాతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంగ్లీష్‌తో పాటు, భారతీయ భాషల్లోనూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు దర్శకుడు తెలిపారు.  

 

మొత్తానికి అబ్దుల్ కలాం జీవిత చరిత్ర తెరకెక్కుతోంది. ఆయన బాల్యం నుంచి ఎలా కష్టపడ్డారు.. ఎలా రాష్ట్రపతి స్థాయికి ఎదిగారు అనేదానిపై కూలంకషంగా చిత్రీకరించనున్నారు. ఆయన హావభావాలుక తగ్గట్టుగా ఉండేలా అలీతో నటింపజేస్తున్నారు. అదే హెయిర్ స్టైయిల్.. అదే డ్రెస్.. అదే నడకతో ఉండేలా ట్రైనింగ్ కూడా ఇవ్వబోతున్నారు. ఇప్పటికే ఎంతో మంది జీవిత చరిత్రలు తెరకెక్కాయి. కానీ అబ్ధుల్ కలాం జీవిత చరిత్ర ఇపుడు తెరకెక్కుతుండటంతో ఆయన అభిమానులు ఎంతో ఖుషీగా ఫీలవుతున్నారు. ఎందుకంటే ఇప్పటికీ ఆయన సూక్తులను ఫాలో అయ్యేవారు చాలామంది ఉన్నారు. అబ్ధుల్ కలాం జీవితాన్ని అదర్శంగా తీసుకుంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: