టాలీవుడ్ ఇండస్ట్రీలో ‘అర్జున్ రెడ్డి’ సినిమా తో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరో అయిపోయాడు విజయ్ దేవరకొండ. ‘అర్జున్ రెడ్డి’ విజయం తో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అప్పట్లో అనేక రికార్డులు సృష్టించిన విజయ్ దేవరకొండ అదే సమయంలో అనేక అవకాశాలు అందుకున్నాడు. ఆ సినిమా తర్వాత పరుశురామ్ దర్శకత్వంలో ‘గీతా గోవిందం’ అనే సినిమా చాలా లోబడ్జెట్ లో తెరకెక్కించి అద్భుతమైన విజయాలు అందుకొన్నాడు. దీంతో వరుసగా రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ కావడంతో విజయ్ దేవరకొండ పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోయింది. కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాక సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పాపులర్ హీరో అయిపోయాడు విజయ్ దేవరకొండ.

 

ప్రస్తుతం ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ తో నలుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. ఇటీవల సినిమాకి సంబంధించి టీజర్ కూడా విడుదలైంది. ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14 వ తారీకు సినిమా రిలీజ్ కానుంది. ప్రస్తుతం సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు చాలా జోరుగా సాగుతోంది. గత కొంత కాలం నుండి విజయ్ దేవరకొండ చేసిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో ఈ సినిమాపై విజయ్ దేవరకొండ అభిమానులు మరియు తెలుగు సినిమా ప్రేక్షకులు చాలా అంచనాలు పెట్టుకున్నారు.

 

ఇదిలా ఉండగా తాజాగా ఇన్ఫోసిస్ చైర్ పర్సన్ సుధా మూర్తి ఓయ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విజయ్ దేవరకొండ యాక్టింగ్ పై సంచలన కామెంట్స్ చేసింది. విజయ్ దేవరకొండ అంటే నాకు చాలా ఇష్టం అతడు బాగా అందగాడు పైగా మంచి నటన పరుడు కచ్చితంగా భవిష్యత్తులో విజయ్ దేవరకొండ చాలా పెద్ద స్టార్ హీరో అవుతాడని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దీంతో ఈమె అన్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: