చిరంజీవి, కొరటాల సినిమాలో మోహన్ బాబు నటిస్తున్నాడా.. ఈ న్యూస్ బైటకొచ్చి చాలా రోజులైనా.. ఎవరూ వ్యతిరేకించలేదు. సమర్థించలేదు. టామ్ అండ్ జెర్రీ అని చెప్పుకునే వీళ్లిద్దరూ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే చూడాలని చాలామందికి ఉంది. 

 

చిరంజీవి, మోహన్ బాబు కలిస్తే.. అదొక సంచలనమే. ఒకరు మరొకరిపై ఎలాంటి సెటైర్స్ వేసుకుంటారోనన్న ఆసక్తి అందిరిలో ఉంటుంది. వజ్రోత్సవంలో ఎవరు సెలబ్రిటీ.. ఎవరు లెజెండ్ అని మోహన్ బాబు స్పీచ్ తో కాంట్రవర్సీ మొదలై విభేదాలు చాలాకాలం సాగింది. కాలంతో పాటు..వయసుతో పాటు.. డిఫరెన్సెస్ సర్ధుమణిగి..ప్రస్తుతం ఒకరిపై మరొకరు ముద్దులు కురిపించుకునేంతగా క్లోజ్ అయ్యారు. 

 

కెరీర్ మొదట్లో చిరంజీవి, మోహన్ బాబు కలిసి బిల్లా రంగా.. పట్నం వచ్చిన పతివ్రతలు లాంటి సినిమాల్లో హీరోగా నటించారు. ఆ తర్వాత చిరంజీవి హీరోగా నటించిన చాలా సినిమాల్లో మోహన్ బాబు విలన్ గా నటించాడు. ఈ కాంబినేషన్ మరోసారి కుదిరింది. 

 

చిరంజీవి, కొరటాల శివ సినిమాలో మోహన్ బాబు ముఖ్య పాత్ర పోషిస్తున్నాడని.. కాదుకాదు.. విలన్ గా కనిపిస్తాడన్న ప్రచారం జరుగుతోంది. రీసెంట్ గా మోహన్ బాబు ఫోటో షూట్ ఫోటోలు సోషల్ మీడియాలో రావడంతో ఇదంతా చిరంజీవి సినిమా కోసమేనంటూ వార్తలొస్తున్నాయి. 

 

డైలాగ్ కింగ్ మోహన్ బాబు గురించి అందరికీ తెలిసిందే. ఆయన వెండితెరపై డైలాగ్స్ పేల్చి చాలా రోజులయింది. ఆయన ఫ్యాన్స్.. ముఖం వాచుకొని కూర్చోనున్నారు. మోహన్ బాబు సిల్వర్ స్క్రీన్ పై కనిపించి చాలా రోజులవడంతో ఆయన సినిమా ఎపుడెపుడు వస్తుందా అని కళ్లలో ఒత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారు. మరి ఆ డైలాగ్ కింగ్ కు మెగాస్టార్ తోడైతే.. ఇక తిరుగేలేదు. ఈ ఇద్దరి కలయిక వెండితెరపై ప్రత్యక్షమైతే.. ఎలా ఉంటుందో ఓ సారి ఊహించుకుంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: