పాన్ ఇండియా సినిమాలతో మార్కెట్ పెరుగుతోంది. స్టార్డమ్ లోనూ మార్పులొస్తున్నాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర ఈ పాన్ ఇండియా ప్లానింగ్ అంతగా పనిచేయడం లేదు. దీంతో లోకల్ వెపన్ ను విసురుతున్నాడు ప్రభాస్. ఘాటు మిర్చిలాంటి కథలు సెలక్ట్ చేసుకుంటున్నాడు. 

 

ప్రభాస్ బాహుబలి తర్వాత మార్కెట్ విస్తరణ పనులు మొదలుపెట్టాడు. మాహిష్మతి సామ్రాజ్యాన్ని విస్తరించినట్టు స్టార్డమ్ ని కూడా ఎల్లలు దాటించాలని పాన్ ఇండియన్ సబ్జెక్ట్ సెలక్ట్ చేసుకుంటున్నాడు. సినిమా రేంజ్ ని పెంచుకుంటున్నాడు. ఈ ఇదిలోనే తెలుగు సినిమాగా మొదలైన సాహో మల్టీ లింగ్వల్ మూవీగా మారింది. 

 

సుజిత్ దర్శకత్వంలో సాహో సినిమా భారీగా తెరకెక్కింది. దాదాపుగా 400కోట్ల బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయింది. ఈ మూవీ ప్రభాస్ ఫ్యాన్స్ ని కూడా మెప్పించలేకపోయింది. బాలీవుడ్ లో వందకోట్లు దాటినా.. తెలుగునాట మాత్రం బయ్యర్లని సేవ్ చేయలేపోయింది. 

 

ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా కూడా మల్టీలింగ్వల్ గానే వస్తోంది. వింటేజ్ లవ్ స్టోరీగా రూపొందుతోన్న ఈ సినిమాను కూడా తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు నిర్మాతలు. అయితే ఈ మూవీ తర్వాత మాత్రం పక్కాలోకల్ డైరెక్టర్ తో సినిమా అనుకుంటున్నాడు ప్రభాస్. 

 

ప్రభాస్ బాహుబలి తర్వాత పక్కా మాస్ సినిమా చేయలేదు. సాహోతో కంప్లీట్ యాక్షన్ జానర్ లోకి వెళ్లాడు. ఇప్పుడు రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ డియర్ అంటూ లవ్ స్టోరీలో నటిస్తున్నాడు. ఇక బాహుబలి పీరియాడికల్ డ్రామా. సో జనాలు ప్రభాస్ ని మాస్ లుక్ తో చూసి ఏడు ఏళ్లు అవుతోందని చెప్పొచ్చు. 

 

ప్రభాస్ కూడా మాస్ స్టోరీస్ గ్యాప్ వచ్చిందని ఫీలవుతున్నాడట. అందుకే తనకు ఓ మాస్ హిట్ ఇచ్చిన మిర్చి డైరెక్టర్ కొరటాల శివతో ఓ సినిమా చేయాలనుకుంటున్నాడు. రెబల్ ఫ్లాప్ తో కొంచెం ఢల్ ఫేజ్ తో ఉన్నపుడు డార్లింగ్ కు మిర్చితో సూపర్ హిట్ ఇచ్చాడు. ఈ మూవీతో ప్రభాస్ మార్కెట్ రేంజ్ కూడా పెరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: