టాలీవుడ్ సినిమా పరిశ్రమకు విక్టరీ వెంకటేష్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వం వహించిన లక్ష్మి సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయిన నటి నయనతార. ఫస్ట్ సినిమా సూపర్ హిట్ తో తెలుగు ఆడియన్స్ మనసు దోచిన నయనతార, ఆ తరువాత మెల్లగా ఇక్కడ కూడా అవకాశాలు పట్టింది. నిజానికి స్వతహాగా మలయాళీ అయిన నయన్, అక్కడి టివి ఛానల్స్ లో కొన్ని ప్రోగ్రామ్స్ చేసిన అనంతరం, మలయాళ సినిమాల్లో అవకాశాలు రావడంతో సినీ రంగంలోకి ప్రవేశించింది. ఆ పై ఆమెకు రజినీకాంత్ నటించిన తమిళ సినిమా చంద్రముఖిలో అవకాశం రావడం, ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో నయన్ పేరు విపరీతంగా మారు మ్రోగింది. 

 

ఇక అక్కడి నుండి తనకు వస్తున్న అవకాశాలు అందుకుంటూ టాలీవుడ్, కోలీవుడ్ లలో మంచి సక్సెస్ లతో ముందుకు సాగిన నయన్, ప్రస్తుతం పెద్ద స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. అయితే నయన్ లైఫ్ లో ఇప్పటివరకు ప్రేమ అనేది మాత్రం కలిసి రాలేదు. మొదట శింబు తో కలిసి కొద్దిరోజలు ప్రేమ వ్యవహారం నడిపిన నయన్, ఆ తరువాత అతడి నుండి విడిపోయి డాన్స్ మాస్టర్ ప్రభు దేవతో ప్రేమాయణం నడిపింది. అయితే అది పెళ్లి చేసుకునే వరకు చేరడంతో, ఒక్కసారిగా ప్రభు భార్య రమా లత్, కోర్టుకెక్కి వాళ్ళిద్దరి పెళ్ళికి బ్రేకులు వేసింది. అప్పటి నుండి ప్రభుతో విడిపోయి ఒంటరిగా ఉంటున్న నయన్, ఇటీవల విగ్నేష్ శివన్ అనే దర్శకుడిని ప్రేమించి, అతడితో కలిసి చట్టాపట్టాలేసుకుని తిరగడం మొదలెట్టింది. 

 

ఇక్కడ ఒక గమ్మత్తయిన విషయం ఏమిటంటే, ఇప్పటివరకు వీరిద్దరూ కలిసి పలు ప్రదేశాలకు తిరిగి కలిసి దిగిన ఫోటోలు పోస్ట్ చేయడమే తప్ప, డైరెక్ట్ గా మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకుంటాం అంటూ అటు నయన్ గాని, ఇటు విగ్నేషన్ గాని బయటపెట్టలేదు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం, వారిద్దరూ అతి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ, వీరిద్దరి లవ్ పై కొందరు ప్రేక్షకులు విరుచుకుపడుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్నాళ్లు ఇలా ఒకరిని మార్చి మరొకరితో చాటు మాటు యవ్వారాలు చేస్తావు, నీకు సిగ్గుగా లేదా, గతంలో శింబు, ఆ తరువాత ప్రభు దేవతో తిరిగిన నువ్వు, కనీసం ఇతనినైనా పెళ్లి చేసుకుంటావా లేదా తల్లి అంటూ కామెంట్స్ చేస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: