రాహుల్ సిప్లిగంజ్ ...ఈ పేరు మొన్నటివరకు అంతగా ఎవరికీ తెలీదు. తెలిసినా అది కేవలం ఒక సింగర్ గానే తెలుసు. తెలుగుతో పాటు తమిళంలోను సూపర్ హిట్స్ సాంగ్స్ ని పాడి బాగా ఫేమస్ అయ్యాడు. కాని అతను ఎలా ఉంటాడో అన్నది మాత్రం జనాలకి అతికొద్దిమందికే తెలుసు. కాని ఈ మధ్య వచ్చిన బిగ్ బాస్ సీజన్ 3 తో మాత్రం సినిమా హీరో రేంజ్ లో పాపులర్ అయ్యాడు. స్టార్ మా లో ప్రసారమైనా ఈ రియాలిటి షో తో రాహుల్ బాగా పాపులర్ అయ్యాడు. టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన ఈ షో సీజన్ 3 బాగా ఆకట్టుకుంది. ఇక ఈ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసిన సింగర్ రాహుల్ ఫైనల్ కంటెస్టెంట్ గా ప్రజ్ అందుకోవడమే కాదు యావత్ తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు.

 

అంతమంది హౌజ్ మెట్స్ తో అన్ని రోజులు హౌజ్ లో ఉండగలుగుతాడా అన్న అందరి అనుమానాలను తారుమారు చేశాడు. సీజన్ మొదలైన మూడోవారం నుండే రాహుల్ ఎలిమినేట్ అవుతాడని అందరు అనుకునేవారు. అంతేకాదు ప్రతీసారి ప్రతీవారం సేఫ్ జోన్ లోకి వెళుతూ ట్విస్ట్ లిచ్చేవాడు రాహుల్. హౌజ్ మెట్స్ సపోర్ట్ తో పాటు జనాలు సపోర్ట్ చేసి ఆదరించడంతో రాహుల్ సామర్థ్యం ఏంటో అందరికీ తెలిసింది. అయితే ఆఖరి వరకు ఉంటాడని టైటిల్ గెలుచుకుంటాడని మాత్రం ఎవరికీ నమ్మకం లేదు. అటువంటిది రాహుల్ అంచనాలు పెంచుతూ వచ్చాడు. తన ఆటిట్యూడ్, సింపుల్ బిహేవియర్ రాహుల్ ని టైటిల్ కి అర్హుడిని చేసింది.

 

ఇదంతా ఒక ఎత్తైతే హౌజ్ లో రాహుల్ పునర్నవిల రిలేషన్ బిల్డ్ అవడం ఒకెత్తు. ఇంకా చెప్పాలంటే వీళ్ళ మధ్య ఉన్న రిలేషన్ ఏంటో అన్న కుతూహలాన్ని ఈ జంట క్రియోట్ చేశారు. రోజు రోజుకి వీళ్ళ మధ్య బంధం గట్టి పడుతుండటంతో ఏదైనా రొమాంటిక్ సీన్ చూసే ఛాన్స్ ఉంటుందేమో అన్న హాట్ క్యూరియాసిటీ ని రాహుల్ పునర్నవి జనాలకి క్రియీట్ చేశారు. అంతమంది హౌజ్ మెట్స్ ఉన్నా కూడా పున్ను రాహుల్ మీద స్పెషల్ కేరింగ్ అండ్ బ్లా బ్లా చూపించడంతో ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ ఉందని ఫిక్సైపోయారు. కానీ చివరకి మా మధ్య ఏమీ లేదని ఇద్దరం మంచి ఫ్రెండ్సేనని గాలి తీసేశారు. కానీ జనాలకి మాత్రం అది అబద్ధం అని సహజంగానే అనుకుంటున్నారు. కానీ వాస్తవంగా రాహుల్ ఇంతగా పాపులర్ అవడానికి మాత్రం ఖచ్చితంగా పునర్నవి అని పక్కా చెప్పాల్సిందే. లేదంటే రాహుల్ అంత పాపులర్ అయ్యోవాడు కాదు. అందులో డౌటే లేదు. ఈ రోజు కృష్ణ వంశీ సినిమాలో గాని సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో ఛాన్స్ రవడానికి గాని కారణం పున్ను నే. అందుకే రాహుల్ తన డియరెస్ట్ పున్నూకి సెషల్ పార్టీ ఇస్తానని వీళ్ళు ఎప్పుడు కలుసుకునే ప్లేస్ లో కలవాలని డిసైడయారట.

మరింత సమాచారం తెలుసుకోండి: