టాలీవుడ్ రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్న యంగ్ అండ్ డైనమిక్ హీరో విజయ్ దేవరకొండ. పెళ్ళి చూపులు చూసిన ఎవరైకైనా అబ్బ ఎంత క్లాస్ హీరో ఎంత అమాయకంగా ఉన్నాడు అనుకుంటారు. కానీ ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా చూస్తే మాత్రం ప్రతీ ఒక్కరికి పిచ్చి పీక్స్ కి చేరాల్సిందే. రగ్డ్ యాటిట్యూడ్, వైల్డ్ పర్ఫార్మెన్స్, హార్ష్ లుక్ ఇలా చెప్పుకుంటూ పోతే విజయ్ గురించి కొత్త కొత్త పదాలు కేవలం ఒక్క అర్జున్ రెడ్డి సినిమా గురించే చెప్పొచ్చు. అంత సెన్షేషనల్ హిట్ అందుకున్న ఈ సినిమా టాలీవుడ్ లో ఒక కేటగిరీ సినిమాలకి ట్రెండ్ సెట్టర్ అయింది. ఆ తర్వాత వచ్చిన గీత గోవిందం మళ్ళీ వేరే విజయ్ ని చూపించింది. ఇలా ఇన్ని వేరియోషన్స్ అతి తక్కువ కాలంలో ఇచ్చిన ఏకైక హీరో విజయ్ దేవరకొండ. 

 

అయితే సినిమా వాళ్లపై అదే ఇండస్ట్రీ వాళ్ల ప్రశంసలు కురిపించడం చాలా కామన్. ఇక కొన్ని సందర్భాలలో రాజకీయ నాయకుల ప్రశంసలు సర్వ సాధారణమే. కానీ బిజినెస్ ఫ్యామిలీస్.. కార్పొరెట్లు.. ఎంటర్ ప్రెన్యూర్ ఫ్యామిలీస్ నుంచి ఎవరైనా ప్రముఖులు పొగిడేయడం కూడా అప్పుడప్పుడు చూస్తునే ఉంటాం. తాజాగా అరుదైన ప్రశంసలను అందుకున్నాడు మన రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఒక అరుదైన వ్యక్తి నుంచి అంతే అరుదైన ప్రశంస దక్కింది. ఇంతకీ వారు ఎవరూ అని అనుకుంటున్నారా ..! అభిమానించి ఆ అభిమానాన్ని పబ్లిక్ గా చెప్పిన కార్పొరెట్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్మన్ సుధామూర్తి. విజయ్ కి సుధామూర్తి ఊహించని సర్ ప్రైజ్ ట్రీట్ అని చెప్పాలి. 69 ఏళ్ల సుధామూర్తి విజయ్ దేవరకొండ నటించిన సినిమాల్ని ఎంతో అభిమానంగా చూస్తారట. గీత గోవిందం సినిమా చూసి విజయ్ కి అభిమానిగా మారారట. ఆ సినిమా తనకు ఎంతో నచ్చిందని అన్నారు. 

 

మన టాలీవుడ్ రౌడీ హీరోకి బాలీవుడ్ లోనూ వీరాభిమానులు ఉన్నారు. బాలీవుడ్ బ్యూటి ఫుల్ హీరోయిన్స్ అయితే మన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మీద మనసు పారేసుకుంటున్నారు. ఇక విజయ్ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ రిలీజ్ కి రెడీ అవుతున్న సందర్భంగా తన ఫోకస్ మరింత ఎక్కువగా పెరిగింది. రౌడీపై నాటీ గాళ్స్ ఫోకస్ మితిమీరిపోతుందనడంలోను సందేహమేం లేదు. ఇక ఫిబ్రవరి 14న ఈ సినిమా రిలీజవుతోంది. ఈసారి రిజల్ట్ ఎలా ఉండబోతోందోనన్న ఆసక్తి ఇప్పటికే రౌడీ ఫ్యాన్స్ లో నెలకొంది. అందుకు కారణం విజయ్ గత సినిమా డియర్ కామ్రెడ్ ఘోరంగా ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే.   

మరింత సమాచారం తెలుసుకోండి: