ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో తమ్మారెడ్డి అన్ని విషయాలలో చాలా యాక్టివ్ గా ఉండేవారట. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు విద్యానగర్, కాచిగూడ, బర్కత్‌పుర ..ఇలా ఆ చుట్టు పక్కల ప్రాంతాలన్ని తన స్నేహితులతో బాతాకాని కొడుతూ తిరిగేవారట. ఇక కాలేజీ అన్నాక అల్లర్లు, గొడవలు చాలా సహజం. అందులో తమ్మారెడ్డి అనవసరంగా తల దూర్చేవారు కాదట. కానీ న్యాయం గా ఉండే ఏ విషయాలకైనా పోరాటం చేసేవారట. ఇందులో మాత్రం అసలు కాంప్రమైజ్ అయ్యోవారు కాదట. అవసరమైతే కొట్టుకేందుకు కూడా వెనకాడబోరట. కొన్ని సందర్భాలలో గొడవలు జరిగి కొట్టుకొని తలలు పగలకొట్టున్నారట కూడా. 

 

ఇక ఉద్యమాలల్లో చురుగ్గా పాల్గొని అందరిని చైతన్యవంతులుగా చేసేవారట తమ్మారెడ్డి. అప్పటికి ఎప్పటికి ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన గొడవల్లో అత్యంత దారుణంగా చంప బడ్డ జార్జ్ రెడ్డి తమ్మారెడ్డికి చాలా క్లోజ్ ఫ్రెండ్ అన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఆయనకి చాలా విషయాలలో తమ్మారెడ్డి సపోర్ట్ చేసేవారట. చదువులో ఎంత క్లవర్ గా ఉండేవారో ఉద్యమాలు లేవనెత్తడం లోను, న్యాయం కోసం స్టూడెంట్స్ తరపున పోరాటం జరిపే విషయంలోను జార్జ్ రెడ్డికి ఎప్పుడు అండగా ఉండేవారట. అయితే ఎప్పుడు తన వెంట ఉండే తమ్మారెడ్డి జార్జ్ రెడ్డి ని చంపినప్పుడు మాత్రం దగ్గలేరట. మద్యాహ్నం భోజనం చేద్దామని హోటల్ కి వెళ్ళిన తమ్మారెడ్డికి తన స్నేహితులు వచ్చి జార్జ్ రెడ్డిని ఏసేశారని చెప్పగానే తమ్మారెడ్డి పరిగెత్తుకుంటూ ఉస్మానియా యూనివర్సిటి కి వచ్చారట. అప్పటికే పక్కా ప్లాన్ వేసుకున్న అవతలి గ్యాంగ్ లైబ్రేరీలో జార్జ్ రెడ్డి ని అత్యంత కిరాతకంగా పొడిచి చంపేశారట. అది చూసిన తమ్మారెడ్డికి గుండె పగిలినంత పనైందట. 

 

అప్పటికీ జార్జ్ రెడ్డిని నాతో రమ్మని పిచారాట తమ్మారెడ్డి. కాని నాకు పని ఉంది నువ్వు వెళ్ళి రా అని చెప్పడంతో తమ్మారెడ్డి వెళ్ళారట. అలా వెళ్ళిన కొద్దిసేపటికే జార్జ్ రెడ్డి ని చంపేశారు. అదే గనక నేను ఉండి ఉంటే ఆ రోజు అంత ఘోరం జరిగేది కాదని తమ్మారెడ్డి కొన్ని సందర్భాలలో తెలిపారు. ఇక ఈ మధ్య వచ్చిన జార్జ్ రెడ్డి సినిమాలో చూపించినవన్ని దాదాపు నిజాలే అని కాకపోతే కొన్ని మరీ సినిమాటిక్ గా కమర్షియల్ వేలో చూపించారని తమ్మారెడ్డి అభిప్రాయపడ్డారు.  
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: