సినిమా షూటింగ్ సమయంలో చిన్న చిన్న ప్రమాధాలు జరుగుతూనే ఉంటాయి. అయితే కొన్ని రీస్కీ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో జరిగే ప్రమధాల కారణంగా భారీ నష్టాలే జరుగుతుంటాయి. ఇలాంటి సంఘటనలు కూడా సినిమా షూటింగ్‌ల సమయంలో చాలానే జరిగాయి. గతంలో ఓ కన్నడ సినిమా షూటింగ్ జరుగుతుండగా ఇద్దరు ఫైటర్లు ఓ రిజర్వాయర్‌లో పడి మరణించటం పెద్ద దుమారమే లేపింది. తెలుగులోనూ ఓ సినిమా షూటింగ్‌లో స్టంట్ మాస్టర్‌ ప్రాణలు విడిచిన ఘటన జరిగింది.

 

తాజాగా రామోజీ ఫిలిం సిటీలో ఓ సినిమా షూటింగ్‌లో భారీ పేలుడు సంబవించింది. కొత్తపేటలో ఉన్న సాయి సంజీవని ప్రయివేట్ ఆసుపత్రికి తీవ్రంగా కాలిన గాయాలైన ఓ వ్యక్తిని ఆదివారం ఉదయం చేర్పించారు. ఆ వ్యక్తి పేరు రావ్ సాబ్ , వయస్సు సుమారు 48 సంవత్సరాలు, మహారాష్ట్రకు చెందిన రావ్ సాబ్ సినిమా సెట్టింగ్ పనులకు సంబంధించిన కార్మికుడు.

 

ఆదివారం తెల్లవారు జామున తాను పనిచేస్తున్న ప్రాంతంలో జరిగిన భారీ పేలుడు ఘటనలో రావ్ సాబ్ తీవ్రంగా గాయపడ్డాడ్డట్టుగా తెలుస్తోంది. యాభై శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరిన రావ్ సాబ్ పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం రామోజీ ఫిలిం సిటీలో జరిగినా ఆ విషయాన్ని అంతా గోప్యంగా ఉంచటంపై అనుమానాలు కలుగుతున్నాయి.

 

పొట్ట కూటికోసం మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు వచ్చిన అనేక మంది కార్మికుల్లో రావ్ సాబ్ కూడా ఒకరు.సినిమా సెట్టింగులకు సంబంధించి ప్లాస్టిక్ షీట్ల అతికింపు పనుల్లో వీళ్లు పనిచేస్తున్నట్లు తెలిసింది. పనిచేస్తున్న ప్రాంతంలోనే పేలుడు జరిగి రావ్ సాబ్ తీవ్రంగా గాయపడ్డారనేది ప్రాథమిక సమాచారం. 

 

అయితే ఈ సంఘటనను సినిమా సెట్టింగ్ నిర్వహణ సంబంధీకులు గోప్యంగా ఎందుకు ఉంచారు? పేలుడు ఘటనకు దారి తీసిన పదార్థాలేమిటి? ఏ సినిమా షూటింగ్‌లో ఈ ప్రమాదం జరిగింది? వంటి ప్రశ్నలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా తీవ్రంగా గాయపడిన రావ్ సాబ్ ప్రస్తుతం ఐసీయూలో ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: