టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ సృష్టించిన విజయ్ దేవరకొండ లేటెస్ట్ ఫిల్మ్ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో ఈ వాలెంటైన్స్ డే రోజు వస్తున్నాడు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తాను ఇక మీదట లవ్ స్టోరీస్ చేయనని అన్నాడు విజయ్. తనకు ఇంత క్రేజ్ ను తెచ్చిన లవ్ స్టోరీస్ ను విజయ్ ఎందుకు చేయనంటున్నాడో తెలియాల్సి ఉంది.

 

అయితే ఈ మూవీలో నలుగురు హీరోయిన్స్ లో ఒకరైన రాశి ఖన్నా మాత్రం విజయ్ లవ్ స్టోరీస్ చేయనని చెప్పడం ఏం బాగాలేదని.. అలా చేస్తే తన ఫ్యాన్స్ హర్ట్ అవుతారని చెప్పారు రాశి ఖన్నా. విజయ్ కు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అని అలాంటిది తను లవ్ స్టోరీస్ తీయనని చెప్పడం షాకింగ్ గా ఉందని అన్నారు. కొద్దిగా గ్యాప్ తీసుకుని అయినా విజయ్ మళ్ళీ ప్రేమకథా సినిమాలు చేయాలని కోరుకుంటున్నానని రాశి ఖన్నా అన్నారు.

 

ఒక హీరో ఇచ్చిన స్టేట్మెంట్ కు వెంటనే స్టేజ్ మీదే అలా చేయొద్దని చెప్పడం కూడా ఇదే మొదటిసారి అని  చెప్పొచ్చు. రాశి ఖన్నా కామెంట్ చేసిందని కాదు కాని అసలు విజయ్ ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నాడు.. దీని వెనుక కారణం ఎవరు అన్న కోణంలో ఆలోచిస్తున్నారు. ఇక సినిమా విషయానికి వస్తే ఈ మూవీలో నాలుగు రకాల లవ్ స్టోరీస్ తో వస్తున్నాడు విజయ్ దేవరకొండ. డియర్ కామ్రేడ్ ఆశించిన స్థాయిలో ఫలితం అందుకోలేదు అందుకే వరల్డ్ ఫేమస్ లవర్ తో మళ్ళీ తన స్టామినా ఏంటో ప్రూవ్ చేయాలని చూస్తున్నాడు విజయ్. ఈ మూవీలో రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్, ఇజాబెల్లా హీరోయిన్స్ గా నటించారు.గోపి సుందర్ మ్యూజిక్ అందించిన ఈ మూవీ సాంగ్స్ కూడా బాగున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: