తమిళ సిని పరిశ్రమలో సింగర్స్ మీద జరుగుతున్న లైంగిక వేదింపుల మీద సింగర్ చిన్మయి తన పోరాటం చేస్తూనే ఉంది. రైటర్ వైరముత్తు మీద తనని లైంగికంగా వేధించాడని అయినా అతని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని చెబుతున్న చిన్మయి.. సింగర్ కార్తీక్ వల్ల కూడా చాలామంది అమ్మాయిలు లైంగిక వేధింపులకు గురయ్యారని..  వాళ్ళకి న్యాయం జరగాలని అన్నారు చిన్మయి. అలాంటి వారికి తాను అండగా ఉండాలని నిర్ణయించుకున్నారు చిన్మయి.

 

వేధింపుల ఈ విషయంపై మాట్లాడుదాం అని మనో గారు తనని ఇంటికి పిలిచారని తమకు న్యాయం జరుగుతుందని అక్కడకి వెళ్తే ఆయన కూడా రాజీ ప్రయత్నాలు చేశారని అన్నారు చిన్మయి. కార్తీక్ కష్టపడి పైకొచ్చిన వ్యక్తి ఆ విషయం తనకు తెలుసు..  అలాంటి వ్యక్తి ఇతరులను వేధించడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు చిన్మయి. మీరంతా గొప్ప గాయకులే కాని గొప్ప మగాళ్లు మాత్రం కాదని అంటూ మరోసారి తన కోపాన్ని కామెంట్స్ రూపంలో చూపించారు చిన్మయి. 

 

డబ్బింగ్ యూనియన్ అధ్యక్ష పదవికి తాను నామినేషన్ వేసినా తన నామినేషన్ వేయకుండా అడ్డు పడ్డారని.. వైరముత్తు, రాధా రవిలే తన నామినేషన్ ను ఆపేశారని అన్నారు చిన్మయి. అయితే చిన్మయి ఇంకొంత మంది తమ గొంతు విప్పితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. చిన్మయి మాత్రం ఈ విషయాన్ని అంత ఈజీగా వదిలేలా లేదు. వైరముత్తు మీద చేసిన కామెంట్స్ కు అక్కడ చిన్మయికి అవకాశాలు రాకుండా చేస్తున్నారు.అయితే ఈమధ్యే ఆమెకు తమిళ అవకాశాలు కూడా వస్తున్నాయని తెలుస్తుంది. డబ్బింగ్ యూనియన్ అధ్యక్ష పదవికి తన నామినేషన్ తీసుకొని వాళ్ళు కార్తీక్ నామినేషన్ మాత్రం తీసుకోవడంపై చిన్మయి మరింత సీరియస్ అవుతుంది. తనకు న్యాయం జరిగే వరకు చిన్మయి ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేలా లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: