జాగర్లమూడి రాధాకృష్ణ షార్ట్ గా పిలవాలంటే క్రిష్... టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక క్లాసిక్ డైరెక్టర్. గమ్యం, వేదం కృష్ణం వందే జగద్గురుమ్, గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి అద్భుతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించాడు. అయితే అతడు తెరకెక్కించిన అన్ని చిత్రాలు కుటుంబంతో కలిసి చూసే విధంగా ఉంటాయి. నిజానికి క్రిష్ ఇటువంటి క్లాసిక్ మూవీస్ చేయగలగడం తప్ప మరేతర చిత్రకళలలోని శైలిలలో దిట్ట అని ఎవరికీ తెలియదు. అయితే తాజాగా అతడి గురించి ఒక వార్త వెలుగులోకి వచ్చి అందరిని నోరెళ్ళబెట్టిలా చేస్తుంది.


వివరాల్లోకి పోతే.. అల్లు అరవింద్ 'ఆహా' అనే ఒక సరికొత్త ఓటిటి ప్లాట్ ఫామ్ ని ఆరంభించాడు. దీనిలో నెట్ ఫ్లిక్, అమెజాన్ ప్రైమ్ లాగా మూవీస్, వెబ్ సిరీస్, సీరియల్స్, ఇంకా ఎన్నో చూసే అవకాశం ఉంటుంది. అయితే ఈ షోలన్నిటిని చూసేందుకు కొంత డబ్బు పెట్టి సబ్స్క్రిప్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. నెట్ ఫ్లిక్ ప్లాట్ ఫామ్ వెబ్ సిరీస్ లను రూపొందించినట్లు.. ఆహా ఫ్లాట్ ఫామ్ కూడా సరికొత్త వెబ్ సిరీస్ లను రూపొందించింది. మొట్టమొదటిగా మ‌స్తీస్‌ అనే వెబ్ సిరీస్ ను రూపొందించిన వెబ్ సిరీస్ లో కుమారి 21ఎఫ్ ఫేమ్ హెబ్బా పటేల్, నవదీప్ ఇంకా ఇతర నటులు ప్రధాన పాత్రలలో నటించారు.


ఇకపోతే ఈ వెబ్ సిరీస్ లో పూర్తిగా అడల్ట్ కంటెంట్ మాత్రమే ఉంటుంది. అదీ వెబ్ సిరీస్ లలో చాలా కామన్. కానీ కేవలం పెద్దలకు మాత్రమే అని రూపొందిన మ‌స్తీస్‌ వెబ్ సిరీస్ కు క్రిష్ కథను అందించాడట. ఇది తెలిసిన తెలుగు ప్రేక్షకులు మొత్తం ఆశ్చర్యపోతున్నారు. క్రిష్ ఇటువంటి కథలను కూడా రాస్తాడాా? అని ఛీ కూడా కొడుతున్నారు చాలామంది నెటిజనులు. అయితే క్రిష్ ఈ వెబ్ సిరీస్ గురించి మాట్లాడుతూ... 'నేను కేవలం చారిత్రక సినిమాలే చేస్తాననుకుంటున్నారు. కానీ నాలో మరో కోణం ఉంది. అది మ‌స్తీస్‌ వెబ్ సిరీస్ ద్వారా అందరికీ తెలుస్తుంది' అని చెప్పుకొస్తున్నాడు. ఏదేమైనా చాలా క్లాసిక్ సినిమాలకు దర్శకత్వం వహించిన క్రిష్ అడల్ట్ కంటెంట్ రైటర్ గా మారటం అందర్నీ విస్తుపోయేలా చేస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: