సాధారణంగా ప్రభుత్వం ఇచ్చే కాంట్రాక్ట్ లకు భారీ వ్యాపారాల ఏజెన్సీ లకు ఉద్యోగాలకు ట్రాన్స్ ఫర్లకు రికమెండేషన్ లు పైరవీలు జరుగుతూ ఉంటాయి. దీనికి భిన్నంగా ఎవరూ ఊహించని విధంగా విడుదలకు ఇంకా ఏడాది సమయం ఉన్నా ‘ఆర్ ఆర్ ఆర్’ డిస్ట్రిబ్యూషన్ హక్కుల కోసం ఇప్పుడు రాజమౌళికి అదేవిధంగా ఆ మూవీ నిర్మాతకు వస్తున్న రికమెండేషన్స్ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి.


‘బాహుబలి’ సిరీస్ తరువాత రాజమౌళి సినిమా కావడం ఎన్టీఆర్ చరణ్ ఆలియాభట్ లాంటి ప్రముఖ తారాగణం ఉండటంతో పాటు ఈ మూవీ సంక్రాంతి సీజన్ కు విడుదల అవుతున్న పరిస్థితులలో బయ్యర్లు ఈ మూవీకి ఎంత భారీ మొత్తాన్ని అయినా ఇవ్వడానికి రెడీ అవుతూ ప్రతి ఏరియాకు కనీసం నలుగు నుండి ఐదుగురు పోటీ పడుతూ ఉండటంతో ఈ మూవీ రెట్లు చుక్కలు తాకుతున్నట్లు టాక్. వందకోట్ల రేషియో అయినా రెడీ అంటున్న బయ్యర్లను చూసి రాజమౌళి కూడ షాక్ అవుతూ ఎవరికీ ఇవ్వాలి అన్న విషయమై కన్ఫ్యూజ్ అవుతున్నట్లు తెలుస్తోంది. 


ఇప్పటికే ప్రభాస్ జూనియర్ చరణ్ లతో పాటు ఇండస్ట్రీకి సంబంధించిన అనేకమంది ప్రముఖుల రికమెండేషన్ తో ప్రతి ఒక్కరు ఎవరో ఒకరి రికమెండేషన్ తో రాజమౌళిని కలుస్తూ ఉండటంతో జక్కన్నకు ఇబ్బందిగా మారినట్లు టాక్. ఇప్పటికే రాజమౌళి సన్నిహితుడు సాయి కొర్రపాటికి మూడు ఏరియాలు ఇచ్చారరు అన్న వార్తలు వస్తున్నాయి. ఇన్ని ఏరియాలు సాయి కొర్రపాటికి ఇచ్చారంటే దాని వెనుక రాజమౌళి హస్తం ఉన్నది ఓపెన్ సీక్రెట్. 


అదేవిధంగా ఎన్టీఆర్ కు కొరటాల శివకు సన్నిహితుడైన భరత్ చౌదరికి ఈస్ట్ గోదావరి హక్కులు లభించాయి అన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఇక్కడ ప్రభాస్ చుట్టాలు కూడ పోటీ పడుతూ ఈ ఏరియ హక్కుల కోసం ప్రభాస్ ను రంగంలోకి దించినట్లు టాక్. నైజాం ఏరియాకు దిల్ రాజ్ పోటీ పడుతున్న పరిస్థితులలో అతడి ఆఫర్ చేసే రేంజ్ కి మించి మరి కొందరు మరిన్ని భారీ ఆఫర్లు ఇస్తున్నట్లు సమాచారం. ఈ డిస్ట్రిబ్యూషన్ హక్కులకు జరుగుతున్న పోటీలో కొంతమంది ప్రముఖ రాజకీయ వేత్తలు మంత్రుల సన్నిహితులు కూడ ఉండటంతో రాజమౌళి ఈ విషయంలో చాల వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు టాక్.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: