సెన్సేషనల్ స్టార్‌ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌. ప్రేమికుల రోజు కానుకగా ఈ నెల 14న రిలీజ్‌ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకను అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అభిమానులతో పాటు చిత్రయూనిట్ పాల్గొన్నారు. తన ప్రతీ సినిమా వేడుకలో అదిరిపోయే స్పీచ్‌తో అదరగొట్టే విజయ్‌ ఈ వేడుకలో కూడా ఇరగదీశాడు.

 

ఈ సందర్భంగా ఇది తాను చేస్తున్న చివరి లవ్‌ స్టోరి అని చెప్పాడు విజయ్ దేవరకొండ. ఈ సందర్భంగా విజయ్‌ మాట్లాడుతూ `నాలుగేళ్ల క్రితం పెళ్లి చూపులు సినిమాతో మీ ముందుకు హీరోగా వచ్చా.. నాలుగేళ్లు అవుతుంది. ఏడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇది నా తొమ్మిదో సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్. ఈ నాలుగేళ్లలో చాలా చేశాం. హిట్లు కొట్టాం.. కొన్ని చేతి నుండి జారిపోయాయి. తమిళ్ సినిమా కూడా చేశా. ఈ జర్నీలో మీరు నేను ఏం చేసినా నాతో ఉన్నారు. అంతకుముందు విజయ్ అంటే ఎవడో ఎవరికీ తెలియదు. అట్లాంటిది 2016 నుండి 2020 వరకూ నాకు తోడుగా ఉన్నారు.

 

మనం ఈ సంవత్సరం నుండి ఇంకా చాలా చేయబోతున్నాం. నేను ఏది చేయాలన్నా సిక్స్ కొట్టాలనే దిగుతా. ఈ సింగిల్‌ డబుల్‌లు నాకు ఓపిక ఉండదు. కొడితే స్టేడియం బయట బాల్ పడాలని బ్యాట్ ఊపుతా.. అర్జున్ రెడ్డి, గీత గోవిందం, నోటా, డియర్ కామ్రేడ్ చేసినా ఇలా ప్రయోగాలు చేశాం. కొన్ని అనుకున్నట్టుగానే స్టేడియం బయట పడ్డాయి. మరికొన్ని బౌండరీ దగ్గర క్యాచ్‌లు పడ్డాయి. కాని భయం అయితే లేదు. ఎప్పుడు దిగినా సిక్స్ కొట్టాలనే దిగుతా.


ఇది నా చివరి ప్రేమకథా చిత్రం అని చెప్పా. అందుకే ఈ సినిమాలో అన్ని రకాల ప్రేమకథలు కవర్ చేయాలని ఫిక్స్‌ అయ్యా. అందుకే మూడు రకాల రోల్స్ ప్లే చేశా. నాలుగు విబిన్న కథలు, వారి ప్రేమ, వారి కష్టలు, ఇలా ఎన్నో ఈ సినిమాలో చూపించాం. ఒక టీం గెలవాలంటే ఒక్క ప్లేయర్‌ మంచి ఆడితే సరిపోదు.. అందరూ ఆడాలి. ఈ సినిమాలో నాతో హీరోయిన్స్‌గా నటించిన నలుగురు అమ్మాయిలు ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. రాశి, ఐశ్వర్య, కేథరిన్, ఇసాబిల్లా అందరూ సూపర్బ్‌గా పర్ఫామ్‌ చేశారు అన్నాడు విజయ్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: