ప్రస్తుతం టాలీవుడ్ లో సూపర్ ఫామ్ లో ఉన్న పూజా హెగ్దే వరుస స్టార్ సినిమాలు చేస్తూ బిజీ షెడ్యూల్ తో కెరియర్ నడిపిస్తుంది. టాలీవుడ్, బాలీవుడ్ రెండు చోట్ల మంచి ఆఫర్లు అందుకుంటుంది పూజా హెగ్దే. తెలుగులో అయితే ఈమధ్యనే వచ్చిన అల వైకుంఠపుములో సెన్సేషనల్ హిట్ కాగా ఈ మూవీ హిట్ అమ్మడి కెరియర్ ను మరింత స్ట్రాంగ్ అయ్యేలా చేశాయి. 

 

ఇక ఇదిలాఉంటే పూజా హెగ్దే స్టార్ హీరో తనయుడితో ప్రేమలో పడ్డదన్న వార్తలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ముంబై మీడియా కథనాల ప్రకారం పూజా హెగ్దే బాలీవుడ్ సీనియర్ స్టార్ వినోద్ మెహ్రా తనయుడు రోహన్ వినోద్ మెహ్రాతో ప్రేమలో ఉందట. బజార్ సినిమాతో పాపులర్ అయిన రోహన్ పూజా అందాలకు ఫ్లాట్ అయ్యాడట. ఎక్కడ చుసిన వీరిద్దరే కనబడుతున్నారట. డేటింగ్ లో  ఉన్న ఈ ఇద్దరు నేడో రేపో అఫీషియల్ గా ఆ విషయాన్ని బయటపెడతారని అంటున్నారు. తెలుగు స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే బాలీవుడ్ హీరో ప్రేమపై రకరకాల వార్తలు వస్తున్నాయి. 

 

అయితే వీటిలో నిజం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. పూజా మాత్రం వరుస ఆఫర్లతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. మరి అలాంటి ముద్దుగుమ్మకి ప్రేమించే టైమ్ ఉందంటారా. ఇది తేలాలంటే ఇద్దరిలో ఎవరో ఒకరు ఓపెన్ అవ్వాల్సిందే. అల సక్సెస్ తో సూపర్ జోష్ లో ఉన్న పూజా ప్రభాస్ జాన్ మూవీలో నటిస్తుంది. ఈ సినిమా తర్వాత కూడా అమ్మడు వరుసగా స్టార్ ఛాన్సులు అందుకుంటుంది. కెరియర్ మంచి ఫామ్ లో ఉన్న ఇలాంటి టైం లో పూజా ప్రేమ దోమ అనే టైం వేస్ట్ పనులు పెట్టుకోకుండా సినిమాల మీద దృష్టి పెడితే బెటర్ అని అంటున్నారు ఆమె సన్నిహితులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: