క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన కెరీర్ మొదలు పెట్టిన పునర్నవి గురించి బిగ్ బాస్ షో కి ముందు ఎవరికీ పెద్దగా తెలియదు. తన మొహం చూస్తే కొంతమంది గుర్తు పడతారు కానీ తన పేరు మాత్రం తెలుగు సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. కానీ బిగ్ బాస్ షో తర్వాత పునర్నవి చాలా ఫేమస్ అయ్యింది. ముఖ్యంగా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో ఆమె ఇంటి లోపల తను క్లోజ్ గా మూవ్ అయిన విధానం చూసి అందరూ తప్పకుండా వీరిద్దరు ప్రేమలో పడ్డారు అని అనుకున్నారు. ఇక పెళ్లి డేట్ ఒక్కటే బ్యాలెన్స్ అని అనుకుంటూ ఉండగా షో మధ్యలోనే తనకు వేరే లవర్ ఉన్నాడని పున్ను చెప్పింది.

 

అయితే రాహుల్ సిప్లిగంజ్ ఫ్యాన్స్ మాత్రం పునర్నవి ని తమ వదిన అంటూ సోషల్ మీడియాలో తెగ ఊదరగొట్టేశారు. పెళ్లి అయిన వరుణ్-వితిక జంట కన్నా పునర్నవి రాహుల్ జంటకే ఎక్కువ పేరు రావడంతో అసలు వీరిద్దరూ ఇంటి నుండి బయటకు వచ్చాక ఎలాంటి రిలేషన్ లో ఉంటారు అని ఆత్రుతగా ఎదురు చూశారు. అయితే దీనికి తగ్గట్టు రాహుల్ టైటిల్ గెలిచిన కొద్ది నిమిషాలకే పునర్నవిని కారులో ఎక్కించుకుని సంబరాలకు తీసుకొని వెళ్లడంతో అంతా వీరిద్దరి మధ్య ఏదో సీరియస్ సంబంధం ఉందని ఫిక్స్ అయిపోయారు. కానీ రాహుల్ సిప్లిగంజ్ మాత్రం తమ మధ్య డేటింగ్ గట్రా ఏమీ లేదని ఒకవైపు మొత్తుకుంటూనే ఉన్నాడు.

 

ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పునర్నవి తన లవ్ లైఫ్ గురించి బయట పెట్టింది. తను ఒక హైదరాబాద్ అబ్బాయితో సీరియస్ రిలేషన్ షిప్ లో ఉన్నట్లు మరియు అతనితోనే సంవత్సరం ఆమెకు పెళ్లి కూడా జరగనున్నట్టు చెప్పి హాట్ రాహుల్ సిప్లిగంజ్ అభిమానుల గుండెల్లో బాంబు పేల్చింది. అయితే రాహుల్ మాత్రం ఇన్ని రోజులు తను ఎంత మొరపెట్టుకున్నా వినని అందరూ ఇక పునర్నవి ఇచ్చిన దెబ్బతో సైలెంట్ అయిపోయి తనని ప్రశాంతంగా ఉండనిస్తారని తెగ సంబరపడిపోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: