ఈవారం రాబోతుతున్న వాలెంటైన్స్ డేని టార్గెట్ చేస్తూ విడుదలకాబోతున్న 'వరల్డ్ ఫేమస్ లవర్' ఆడియో ఫెయిల్ కావడం విజయ్ ని కలవర పెడుతున్నట్లు సమాచారం. సామాన్యంగా విజయ్ సినిమాల ఆడియో దాదాపుగా సంగీత ప్రియులను మెప్పించేలా ఉంటుంది.  నిజానికి విజయ్ నటించిన కొన్ని సినిమాలకు అతడి సినిమాల పాటల ఆడియో క్లిక్ కావడం  చాలా ప్లస్ అయింది. 


వాస్తవానికి  'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా పాటలు రిలీజ్ అయినప్పటికీ వాటిలో ఒక్కటి కూడా చార్ట్ బస్టర్ గా మారలేదు. గతంలో విజయ్ సినిమాలు రిలీజ్ కు ముందు ఆ సినిమాలో పాటలు మిలియన్ల కొద్దీ వ్యూస్ తో యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతూ ఉండేవి.  అయితే ఈ సినిమాలో పాటలకు ఆ స్థాయిలో స్పందన దక్కక పోవడంతో ఈ మూవీ బయ్యర్లు తీవ్రంగా టెన్షన్ పడుతున్నట్లు సమాచారం. 

గోపి సుందర్ ట్యూన్ చేసిన ఈమూవీలోని ఏ పాటకు సంబంధించిన ట్యూన్ గుర్తు ఉండేలా లేదు అన్న కామెంట్స్ వస్తునాయి. ఈ సినిమాలో ‘మై లవ్’ సాంగ్ మాత్రం 2.8 మిలియన్ వ్యూస్ తో కొంచెం ట్రెండింగ్ లో ఉంటే ఇదే సినిమాలోని  బొగ్గుగనిలో పాటకు ఇప్పటి వరకు 1.3 మిలియన్ వ్యూస్ మాత్రమే వచ్చాయి. 


ఇక మిగతా పాటలకు స్పందన మరింత తక్కువగా ఉండటంతో పాటు ఈ సినిమా పాటలు పెద్దగా బాగాలేవని విజయ్ అభిమానులు కూడ ఓపెన్ గానే కామెంట్ చేస్తున్న పరిస్తితులలో ఈ మూవీ పరిస్థితి ఏమిటి అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ‘డియర్ కామ్రేట్’ పరాజయం తరువాత ఈసినిమా విషయంలో అన్ని వ్యహారాలు దగ్గర ఉండి చూసుకున్న విజయ్సినిమా ఆడియో విషయంలో ఎందుకు అశ్రద్ధ చేసాడు అన్న కామెంట్స్ వస్తున్నాయి. దీనితో ఈ మూవీ ఈ వారంలో సోలో రిలీజ్  గా వస్తున్నా కలక్షన్స్ ఎంతవరకు వస్తాయి అన్నది సందేహమే..

 

మరింత సమాచారం తెలుసుకోండి: