అవును... టాలీవుడ్ డైరెక్టర్స్ కాస్త నిరుత్సాహానికి లోనవుతున్నట్లు బోగట్టా. పవన్ కళ్యాణ్ రాజకీయాను పక్కనబెట్టి, సినిమాలు షురూ చేస్తున్న తరుణంలో.. అందరి ఫోకస్ త్రివిక్రమ్ పైకి వెళ్ళింది. పవన్ కి వున్న అతి కొద్ది సమయాన్ని త్రివిక్రమ్ తన్నుకుపోతాడేమో అని టాలీవుడ్లో మిగిలిన దర్శకులను కలవర పెడుతోంది. వారంతా ఎన్నో సంవత్సరాలనుడి అతనితో సినిమాలు చేయాలని కలలు కంటున్నారు. మరి.. పవన్ స్టాండ్ ఎటువైపు?

 

 

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్‌కు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాసులు మధ్య మంచి స్నేహ బంధం ఉంది. వీళ్లిద్దరు కలిసి తొలిసారి ‘జల్సా’ సినిమా కోసం పనిచేసారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మిశ్రమ ఫలితాన్ని అందుకుంది. ఆ తర్వాత వీళ్లిద్దరి కలయికలో వచ్చిన ‘అత్తారింటికీ దారేది’ సినిమా అప్పటి వరకు ఉన్న తెలుగు ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాసింది. ఆ తర్వాత వీళ్లిద్దరి కలయికలో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ అందరీ అంచనాలు తలకిందులు చేస్తూ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. 

 

 

ఈ మూడు సినిమాలే కాకుండా.. పవన్ కళ్యాణ్ హీరోగా జయంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘తీన్మార్’ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు సమకూర్చిన విషయం అందరికి తెలిసినదే.ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నిర్మాణంలో నితిన్ హీరోగా తెరకెక్కిన ‘ఛల్ మోహన్ రంగా’ సినిమాకు త్రివిక్రమ్  కథను అందించాడు. మధ్యలో చాలా మంది త్రివిక్రమ్‌‌ను తమ సినిమాలకు మాటలు అందించమని కోరినా ఏ సినిమాలకు మాటలు రాయలేదు. తాజాగా పవన్ కళ్యాణ్.. హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన ‘పింక్’ తెలుగు రీమేక్ చేయడానికి ఓకే చెప్పాడు. 

 

 

అయితే.. ఈ సినిమాకు కూడా.. త్రివిక్రమ్ మాటలు రాయనున్నారని వినికిడి. సో... పవన్ కళ్యాణ్ ప్రతి జర్నీలోనూ త్రివిక్రమ్ సహా వున్నాడని అందరికి తెలిసిన విషయమే.. ఇపుడు ఈ విషయమే అందరిని కలవర పెడుతోంది.. ముఖ్యంగా టాలీవుడ్ డైరెక్టర్లను కాస్త భయ భ్రాంతులను చేస్తుంది. మరి, వీరి భయాన్నే పవన్ నిజం చేస్తాడా... లేక త్రివిక్రమ్ ను మినహాయించి, మిగిలిన డైరెక్టర్స్ కు ఓకే చెబుతాడా అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: