విజయ్ దేవరకొండ నటన విషయంలోనే కాదు ఓపెన్ గా పబ్లిక్ ముందు ప్రవర్తించే తీరు చాల విభిన్నంగా కనిపిస్తూ చూసే వారికి బాగా నవ్వులు తెప్పిస్తుంది. ఈ వారం విడుదల కాబోతున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న జరిగింది. ఈ ఈవెంట్ లో పాల్గొన్న ఈ మూవీ హీరోయిన్స్ లో ఒకరైన ఐశ్వర్యా రాజేష్ మాట్లాడుతున్న సమయంలో ఆమె మైక్ లాక్కుని విజయ్ స్టేజ్ పైనే ఓపెన్ గా బెదిరించడం నిన్నటి ఈవెంట్ లో హైలెట్. 


ఐశ్వర్యా రాజేష్ మాట్లాడుతూ విజయ్ గురించి ఎదో చెప్పబోయి ‘విజయ్ దేవరకొండ గారు’ అంటూ కామెంట్ చేసింది. దీనితో విజయ్ ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె మైక్ తీసుకుని ‘ఏంటి? సువర్ణా!! ఏందే.. నీ యవ్వ.. గారు గారు అంటున్నావ్' అంటూ కామెంట్ చేశాడు విజయ్ దేవరకొండ. దీనితో షాక్ అయిన ఆమె తేరుకునే లోపే ఆమె ఈ సినిమాలో నటించిన పాత్ర సువర్ణ అన్న విషయం గుర్తుకు వచ్చి నవ్వుకుంది. 


ఇదే సందర్భంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న యాంకర్ విజయ్ వంక చూస్తూ భవిష్యత్ లో ఇక ప్రేమ సినిమాలు నటించను అని అన్న మాటలకు కట్టుబడి ఉంటావా అని ప్రశ్నించినప్పుడు వేదిక పై చేయి ముందుకు జాపి తాను అన్న మాటలకు కట్టుబడి ఉంటాను అంటూ ప్రమాణం చేయడం ఈ ఈవెంట్ లో మరొక హైలెట్. 'ఇక సింగిల్స్ వద్దని ఈ సినిమాతో సిక్స్ కొట్టేందుకు బ్యాట్ గట్టిగా ఊపా.. బాల్ గాల్లో ఉంది. స్టేడియం బయటపడుతుందో బౌండరీ దగ్గర పడుతుందో నాకు తెలియదు. కాని నా నుండి గ్యారంటీ ఏంటంటే.. ఎప్పుడు మీరు విజయ్ దేవరకొండ సినిమాకి వెళ్లినా ఖచ్చితంగా కొత్త ఎక్స్‌ పీరియన్స్ వస్తుంది.’ అంటూ విజయ్ఈవెంట్ కు వచ్చిన తన అభిమానులకు జోష్ ను కలిగించే ప్రయత్నం చేసాడు..    

 

మరింత సమాచారం తెలుసుకోండి: