బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కి సినిమాల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్ అయితే షారుక్ ఖాన్ పేరెత్తితే చాలు మెలికలు తిరిగి పోతూ ఉంటారు. ఇక ఇప్పటికే ఎన్నో సంచలన విజయాలను నమోదు చేసి బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోనూ తనకంటూ కొన్ని ప్రత్యేకమైన పేజీలు లిఖించుకున్నాడు షారుక్ ఖాన్. షారుక్ ఖాన్ సినిమా వస్తుందంటే వేయికళ్ళతో ఎదురు చూసే అభిమానులు ఎంతో మంది. షారుక్ ఖాన్ సినిమాల్లోనే కాదు అటు సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ ఆక్టివ్ గా ఉంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. తన ఫ్యామిలీకి సంబంధించిన పలు విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు షారుక్ ఖాన్. ఇక తాజాగా తన ఫ్యామిలీ కి  సంబంధించిన విషయాన్ని అభిమానులతో పంచుకుని ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. 

 


 ఏ తండ్రి అయిన  తన కొడుకు ప్రయోజకులు అయితే చూడాలని ఆశ పడుతూ ఉంటారు... అదే చిన్న వయసులోనే కొడుకు ఎంతో ప్రతిభ కనపరిచాడు అంటే తండ్రి  ఆనందానికి అవధులు ఉండవు. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయి  పోతూ ఉంటారు. తాజాగా షారుక్ ఖాన్ కు ఇలాంటి పుత్రోత్సాహం కలిగింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసి ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు.  తన చిన్న కుమారుడు చేసిన పనికి ఎంతో గర్వంగా ఫీలవుతున్నాను అంటూ షారుక్ ఖాన్ తెలిపాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. బాలీవుడ్ బాద్షా షారుక్ఖాన్ చిన్న కుమారుడు అబ్రామ్ తన తండ్రి గర్వపడేలా గోల్డ్ మెడల్ సాధించాడు. కేవలం ఆరేళ్ళ వయసులోనే టైక్వాండోలో  బంగారు పతకం సాధించిన తన కుమారుడు ఫోటోలను పోస్ట్ చేస్తూ బాలీవుడ్ బాద్ షా ఆనందం వ్యక్తం చేశారు. 

 


 శిక్షణ తీసుకున్నాను... ఫైట్ చేశావు.. విజయం సాధించావు... మళ్లీ ఇదే విధంగా కష్టపడి పని చేయు. ఈ పథకంతో నా పిల్లలకు నాకన్నా ఎక్కువ అవార్డులు ఉన్నాయి అని నేను భావిస్తున్నాను.ఇది  మంచి విషయం. ఇప్పుడు నేను మరింత శిక్షణ పొందాల్సి ఉంది. నా  పిల్లలను చూసి నేను ఎంతగానో గర్వ పడుతున్నాను ... వారి నుంచి ఎంతో స్ఫూర్తిని పొందుతున్నాను అంటూ బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్  ట్విట్టర్ వేదికగా... తన చిన్న కుమారుడు అబ్రామ్ గోల్డ్ మెడల్  సాధించడంపై ఆనందం వ్యక్తం చేస్తూ పోస్టు పెట్టారు. ప్రస్తుతం కిరణ్ అనే వ్యక్తి వద్ద అబ్రామ్ తో ఆర్యన్ సుహానాలు  కూడా టైక్వాండో శిక్షణ పొందుతున్నారు. గతంలో వారు కూడా పతకాలను సాధించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: