దర్శక ధీరుడు రాజమౌళి... ఈ పేరుకు తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతగానో క్రేజ్ ఏర్పడింది. బాహుబలి లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత రాజమౌళి ఏదైనా సినిమా తెరకెక్కిస్తున్నారు అంటే ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నాను. అయితే ఓటమెరుగని దర్శకుడిగా ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో దూసుకుపోతున్నారు దర్శక ధీరుడు రాజమౌళి. బుల్లితెర నుంచి తన ప్రస్థానం మొదలు పెట్టిన రాజమౌళి వెండితెరపై కూడా తెలుగు చిత్ర పరిశ్రమకి ఖ్యాతిని  ప్రపంచం నలుమూలలా మారుమోగేలా చేశారు. 

 


 మొదట బుల్లి తెర పై ఓ ధారావాహికను తెరకెక్కించిన దర్శకుడు రాజమౌళి బుల్లితెరపై కూడా తన సత్తా చాటాడు. దీంతో ఆ ధారావాహిక కూడా ఎంతగానో ప్రేక్షకుల ఆదరణను పొందింది. ఇక ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాను తెరకెక్కించి తెలుగు తెరకు పరిచయమయ్యాడు రాజమౌళి. ఇక ఆ తర్వాత స్టార్ హీరోలందరితో సినిమాలు చేసుకుంటూ సంచలన విజయాలను నమోదు చేస్తూ దూసుకుపోయాడు... ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూసుకోలేదు రాజమౌళి. ఇక అటు ప్రేక్షకుల్లో కూడా ఎంతో క్రేజ్ ను సంపాదించుకుని ఎన్నో సంచలన  విజయాలను నమోదు చేశారు. అయితే రాజమౌళి తెరకెక్కించిన ప్రతి సినిమా ఓ సంచలన విజయాన్ని నమోదు చేయడానికి అసలు కారణం ఏమిటి అంటే. 

 


 ఖచ్చితత్వం.. రాజమౌళి సినిమాలో  ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వడు. తన సినిమాలో  అన్ని పర్ఫెక్ట్ గా ఉండేలా చూసుకుంటాడు దర్శక ధీరుడు రాజమౌళి. సాంకేతికపరంగా సంగీతపరంగా... ఎడిటింగ్ పరంగా.. సినిమాటోగ్రఫీ పరంగా... ఇలా ప్రతి విషయంలో సరైన అవగాహనతో.. ప్రేక్షకులు నచ్చి మెచ్చి విధంగా... ఎంతో  పర్ఫెక్షన్ తో సినిమాను తెరకెక్కిస్తాడు . సినిమా చిత్రీకరణలో ఏ చిన్న పొరపాటు కూడా జరగకుండా చూసుకుంటాడు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిన తర్వాత ఏదైనా... అంచనాలకు తగ్గట్లుగా లేదు అనిపిస్తే... అస్సలు కాంప్రమైజ్ అవకుండా... మళ్లీ సినిమాను రీ షూట్  చేయడానికి కూడా వెనుకాడడు. అందుకే ఈ కచ్చితత్వమే రాజమౌళి సినిమా విజయాల సీక్రెట్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: