స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయం అయిన ఎస్ ఎస్ రాజమౌళి, ఆ తరువాత సింహాద్రి, యమదొంగ, సై, ఇలా వరుసగా చెప్పుకుంటూ పోతే మొన్నటి బాహుబలి రెండు భాగాల వరకు కూడా కెరీర్ పరంగా ఒక్క అపజయం లేని దర్శకుడిగా రాజమౌళి సినీ ప్రస్థానం ఎంతో దిగ్విజయంగా దూసుకుపోతోంది. ఇక ప్రస్తుతం మెగా నందమూరి స్టార్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో కలిసి ఆర్ఆర్ఆర్ అనే ప్రతిష్టాత్మక మల్టీస్టారర్ మూవీని తీస్తున్న రాజమౌళి, వ్యక్తిగతంగా ఎంతో సైలెంట్ గా ఉండే వ్యక్తి అని చెప్పాలి. 

 

ఇక తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కూడా ఎప్పుడూ సినిమాల గురించి మాత్రమే ఎక్కువగా చెప్పే అలవాటున్న రాజమౌళి, నేడు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై కొంత ఫన్నీగా ట్వీట్ చేసి వార్తల్లో నిలిచారు. మొదటి నుండి రాజమౌళికి వర్మ అంటే ఎంతో అభిమానం అనే విషయం తెలిసిందే. గతంలో పలు మార్లు రాజమౌళి కూడా వర్మపై పొగడ్తలు కురిపించారు. ఇకపోతే నేడు వర్మని ఉద్దేశించి, మీకు సరిగ్గా సమాధానం చెప్పే మనవరాలు పుట్టింది. ఇకపై మీ దూకుడుకు పక్కాగా ఆమె కళ్లెం వేస్తుందని భావిస్తున్నాను, 

 

రాము తాతయ్య, రాము నాన్న అంటూ ఎంతో ఫన్నీ గా ప్రేమతో కూడిన ఎమోజిలతో పాటు విపరీతంగా నవ్వుతున్న ఎమోజిలను తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసారు రాజమౌళి. అయితే నేడు ఉదయం వర్మ కూతరుకు పాప పుట్టిందని, ఆ విధంగా ఆయనకు శుభాకాంక్షలు చెప్పేందుకు ఈ విధమైన ఫన్నీ ట్వీట్ ని రాజమౌళి పోస్ట్ చేసినట్లు చెప్తున్నారు. మొదటి నుండి ఎంతో సైలెంట్ గా ఉండే రాజమౌళి లో కూడా ఇంత ఫన్నీ యాంగిల్ ఉందా అంటూ ఆయన ట్వీట్ పై పలువురు నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆయన ట్వీట్ పై వర్మ ఎలా స్పందిస్తారో చూడాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: