యాంక‌ర్ ర‌వి బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కరలేని పేరు.. యాంకర్‌గా వచ్చి స్టార్ యాంకర్‌గా పేరు తెచ్చుకుని ఎన్నో షోస్‌కు యాంకరింగ్ చేస్తూ, అందరికి అభిమాన పాత్రుడైయ్యాడు. అయితే యాంకరింగ్ చేస్తూనే సినిమాలో హీరోగా నటించాలనే తన కోరికను నెరవేర్చుకోవడానికి ఒక సినిమాకు కమిట్‌మెంట్ ఇచ్చాడు.. అలా హీరోగా తెరపై కనిపించాలనే ఆశతో ఉన్న రవికి ఊహించని విధంగా షాకులు తగులుతున్నాయి..

 

 

అయితే ఇది మా ప్రేమ క‌థ అనే సినిమాతో రవి హీరోగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ర‌వికి పెద్ద‌గా పేరు ఇవ్వలేకపోయినా, లేనిపోని ఇబ్బందుల‌ని తెచ్చి పెట్టినట్లుగా తెలుస్తుంది... అదేమంటే 2018లో ఈ సినిమా డిస్ట్రిబ్యూట‌ర్ సందీప్.. డ‌బ్బులు ఇవ్వాల‌ని టార్చర్ పెడుతున్నాడ‌ని, భ‌య‌పెట్ట‌డంతో పాటు మాన‌సికంగా హింసిస్తున్నాడ‌ని యాంక‌ర్ ర‌వి మీద ఎస్ ఆర్ న‌గ‌ర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే ఇదే విషయంలో తాజాగా యాంక‌ర్ ర‌వి, డిస్ట్రిబ్యూట‌ర్ సందీప్‌పై  క్రిమిన‌ల్ కేసు పెట్టాడు.

 

 

త‌న ద‌గ్గ‌ర నుండి సందీప్ రూ.41 లక్షలు తీసుకుని తనను మోసం చేశాడంటూ హైదరాబాద్‌లోని కూకట్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. ఇదే కాకుండా సందీప్ వల్ల నాకు ప్రాణహాని ఉందని.. వారి నుండి నన్ను రక్షించండి అంటూ రవి పోలీసులను కోరాడట. అతను నాలాగే చాలమందిని డబ్బుల విషయంలో మోసం చేసి, తిరిగి అడిగితే చెల్లించకుండా బెదిరిస్తున్నాడని,

 

 

అతడి బెదిరింపులతో చాలా మంది భయపడి పోతున్నారంటూ రవి ఇచ్చిన ఫిర్యాదు తో కేసు నమోదు చేసిన కూకట్ పల్లి పోలీసులు విచారణ మొదలు పెడతామంటూ హామీ ఇచ్చారట.. ఇక ఈ సంఘటనల వల్ల రవి కల కలగానే మిగులుతుందేమో అని, తాను ఇండస్ట్రీలో హీరోగా విజయాన్ని సాధించలేనేమో అని మధన పడుతున్నాడట....

మరింత సమాచారం తెలుసుకోండి: