టాలీవుడ్ లో మోస్ట్ ప్రెస్టీజియస్ బ్యానర్స్ లో గీతా ఆర్ట్స్ ఒకటి. ఈ సంస్థ నిర్మాణ బాధ్యతలను దశాబ్దాలుగా అల్లు అరవింద్ సమర్ధవంతంగా నిర్వర్తిస్తున్నాడు. ఎన్నో హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ హిట్లు ఈ బ్యానర్ నుంచి వచ్చాయి. కథల జడ్జిమెంట్ లో కూడా పక్కాగా ఉండే అరవింద్ వరుస సినిమాలు తీస్తూ హిట్ పర్సంటేజ్ ను పెంచుకుంటున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఉన్న భారీ బ్లాక్ బస్టర్స్ లో గీత గోవిందం ఒకటి. విజయ్ దేవరకొండ ఇమేజ్ ను ఫ్యామిలీ ఆడియన్స్ లోకి తీసుకెళ్లిందీ సినిమా.

 

 

అర్జున్ రెడ్డి హిట్ తర్వాత విజయ్ తో రెండు సినిమాల ఒప్పందం చేసుకున్న గీతా సంస్థ చేసిన రెండు సినిమాలు సూపర్ హిట్ చేసింది. గీత గోవిందం, జీఏ2లో చేసిన టాక్సీవాలా రెండూ హిట్ అయ్యాయి. ఇప్పుడు విజయ్ తో గీతా సంస్థ మూడో సినిమా చేసే అవకాశం కూడా ఉందని సంస్థ అధినేత అల్లు అరవింద్ మాటల్ని బట్టి తెలుస్తోంది. వరల్డ్ ఫేమస్ లవర్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో ఇదే విషయాన్ని అరవింద్ స్పష్టం చేశారు. విజయ్ లో ఉన్న మంచి గుణం, కష్టపడేతత్వంతోనే సక్సెస్ అయ్యాడని అన్నాడు. విజయ్ డేట్స్ ఇస్తే మూడో సినిమా చేయడానికి రెడీగా ఉన్నానని చెప్పుకొచ్చాడు.

 

 

టాలెంట్ కు పెద్దపీట వేసే గీతా సంస్థ అధినేతే స్వయంగా సినిమా చేస్తాననడం విజయ్ కు ఇది బంపర్ ఆఫర్ కిందే లెక్క. ప్రతిష్టాత్మక బ్యానర్ లో అవకాశం వెతుక్కుంటూ వస్తే ఏ హీరోకైనా లక్కీనే. తన క్రేజ్ ను అమాంతం పెంచి సౌత్ ఇండియాలో మరింత ఫేమస్ అయ్యేలా చేసిన గీతా సంస్థలో విజయ్ దేవరకొండ మరో సినిమా ఖాయమే అని సినీ పరిశీలకులు భావిస్తున్నారు.                                           

మరింత సమాచారం తెలుసుకోండి: