కోలీవుడ్లో గ‌తేడాది విజయ్ సేతుపతిత్రిష హీరో హీరోయిన్లుగా తమిళనాట బ్లాక్ బస్టర్ నిలిచిన ’96’ సినిమాను తెలుగులో శ‌ర్వానంద్ - స‌మంత జంట‌గా జాను పేరుతో రీమేక్ చేశారు. ఇక తెలుగులోనూ ఈ సినిమా అదే మ్యాజిక్ రిపీట్ కావ‌డంతో మంచి ఓపెనింగ్స్ వ‌చ్చాయి. ఇక దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో స‌మంత న‌టన మెయిన్ హైలెట్‌గా నిలిచింది.

 

ఇక ఫ‌స్ట్ వీకెండ్ ఈ సినిమా బాక్సాఫీస్ రిపోర్ట్ చూస్తే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఈ సినిమా గ‌ట్టెక్క‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. కంప్లీట్ ఎమోష‌న‌ల్ ల‌వ్ స్టోరీగా తెర‌కెక్కిన ఈ సినిమా చూసిన ప్ర‌తి ఒక్క‌రు త‌మ కాలేజ్‌, స్కూల్ డేస్ ల‌వ్‌కు క‌నెక్ట్ అవుతున్నారు. ప్ర‌తి ఒక్క‌రి జీవితంలోని తొలి ప్రేమ‌ను ఆస్వాదిస్తున్నారు.

 

తొలి రోజు జాను ఆంధ్ర – తెలంగాణలో 2.12 కోట్ల షేర్ సాధించింది. ఇక ఫస్ట్ వీకెండ్ 5.5 కోట్ల షేర్ ని సాధించింది. మొత్తానికి ఓ బేబీ, మ‌జిలీ, ఇప్పుడు జాను సినిమాల‌తో స‌మంత వ‌రుస హిట్ల‌తో త‌న గ్రాఫ్ మ‌రింత పెంచుకుంటోంది. అటు ప్లాపుల్లో ఉన్న శ‌ర్వాకు కూడా ఇది మంచి హిట్టే అని చెప్పుకోవాలి. కెరీర్ ప‌రంగా కొద్ది రోజులుగా స‌రైన హిట్లు లేక ఇబ్బంది ప‌డుతోన్న శ‌ర్వానంద్ కెరీర్‌కు స‌రైన టైంలో స‌రైన సినిమా వ‌చ్చింద‌ని విశ్లేష‌కులు వ్య‌క్తం చేస్తున్నారు. ఇక స‌మంత కెరీర్ మ‌రింత పీక్స్‌కు వెళ్లిపోయేలా చేయ‌డంలో జాను స‌క్సెస్ అయ్యింది.

 

జాను ఫ‌స్ట్ వీకెండ్ ఏపీ, తెలంగాణ క‌లెక్ష‌న్స్ :

 

నైజాం – 2.3 కోట్లు

 

సీడెడ్ – 69 లక్షలు

 

గుంటూరు – 40 లక్షలు

 

ఉత్తరాంధ్ర – 87 లక్షలు

 

ఈస్ట్‌ – 36 లక్షలు

 

వెస్ట్‌ – 28 లక్షలు

 

కృష్ణా – 42 లక్షలు

 

నెల్లూరు – 18.5 లక్షలు
----------------------------------------------
ఫస్ట్ వీకెండ్ మొత్తం షేర్ – 5.5 కోట్లు
----------------------------------------------

 

మరింత సమాచారం తెలుసుకోండి: