టాలీవుడ్ లో పెళ్లి చూపులు సినిమాతో హీరోగా పరిచయమైన విజయ్ దేవరకొండ ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమా తో స్టార్ హీరోగా మారిపోయాడు. అర్జున్ రెడ్డి సినిమా తో యూత్ లో ఎంతో క్రెజ్  సంపాదించుకున్నాడు. గత కొన్ని రోజుల పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో తన హవా నడిపించిన విజయ్ దేవరకొండ క్రేజ్ మాత్రం ఇప్పుడు తగ్గుతూ వస్తున్నట్లు కనిపిస్తోంది. కొన్ని రోజులుగా విజయ్ దేవరకొండ సరైన హిట్ కొట్టలేక పోతున్నాడు. నోట డియర్ కామ్రేడ్ సినిమాలు  ఫ్లాప్ కావడంతో ఈ ప్రభావం విజయ్ దేవరకొండ క్రేజ్ పై  భారీగానే పడింది. కాగా ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరో గా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రాశిఖన్నా ఐశ్వర్య రాజేష్ కేథరిన్ థెరిస్సా ఇసబెల్లా నటిస్తున్నారు. 

 

 ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజున విడుదల చేసేందుకు చిత్ర బృందం నిర్ణయించింది. అయితే విడుదలకు కొన్ని రోజులే ఉన్నప్పటికీ ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇంకా ఎలాంటి ఆసక్తి లేదు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పాటలకు కూడా ఎక్కడా ప్రస్తావన లేదు. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా పాటలు విడుదలైనప్పటి నుంచి వాటిలో ఒక్కటి కూడా బ్లాక్ బస్టర్ గా మారలేదు. గతంలో విజయ్ దేవరకొండ సినిమాలు రిలీజ్ కు ముందే ఆ సినిమాలో పాటలు మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించాయి. విడుదలకు ముందే చాలా రోజుల పాటు విజయ్ దేవరకొండ సినిమా పాటలు యూట్యూబ్ లో ట్రేండింగ్  గా మారాయి... కానీ ప్రస్తుతం అలాంటిదేమి  కనిపించడం. 

 


 అయితే ఈ సినిమాలో పాటలకు విజయ్ దేవరకొండ గత సినిమాలకు దక్కినంత స్పందన దక్కడం లేదు. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో ఒక పాట చెప్పమంటే మెజారిటీ ప్రేక్షకులు జవాబు చెప్పలేక తెల్లమొహం వేసేలా ఉన్నారు. సినిమాకు గోపీసుందర్ సంగీత దర్శకుడిగా స్వరాలను సమకూర్చారు. సినిమాలోని మై లవ్ సాంగ్ మాత్రం 2.8 మిలియన్  వ్యూస్  తో కొంచెం పరవాలేదు అనిపించినప్పటికీ . మిగతా సాంగ్స్ మాత్రం ఎక్కడ కనిపించడం లేదు. ఇక  బొగ్గుగనిలో పాటకు 1.3 మిలియన్ వ్యూస్ మాత్రమే వచ్చాయి. దీంతో ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ మొత్తం అట్టర్ ప్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది అని చెప్పాలీ. మరోవైపు అటు సినిమా పైన కూడా ప్రేక్షకుల్లో  ఎక్కువగా బజ్ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో అని  ప్రేక్షకులు కూడా అయోమయంగానే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: