అంకురం చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు జాతీయ పురస్కారం అందించిన దర్శకుడు సి. ఉమామహేశ్వరరావు రూపొందిస్తున్న తాజా చిత్రం ఇట్లు అమ్మ. మదర్స్ ఆఫ్ ద వరల్డ్ యునైట్ అనేది ఈ చిత్ర ఉపశీర్షిక. చెడుమార్గంలో పయణిస్తున్న సమాజం తిరిగి సన్మార్గం పట్టేందుకు అమ్మ ముందడుగు వేయాలనే సందేశాన్ని ఇట్లు అమ్మ చిత్రం ఇవ్వబోతోంది. మంచి సమాజాన్ని నిర్మించేందుకు ప్రపంచంలోని అమ్మలంతా ఒక్కటవ్వాలనే పిలుపునిస్తుందీ సినిమా. ఈ సందేశాత్మక చిత్రాన్ని బొమ్మక్ క్రియేషన్స్ పతాకంపై బొమ్మక్ మురళి నిర్మించారు. నాగులపల్లి కనకదుర్గ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. తాజాగా ఈ సినిమా టైటిల్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తో పాటు దేవి, విమల వంటి పలువురు వుమెన్ ఆక్టివిస్టులు పాల్గొన్నారు.


      

రేవతి మాట్లాడుతూ...ఒక అమ్మ ప్రయాణమే ఈ సినిమా. ఒక స్గ్రీ మ‌ధ్య‌ వయస్సులోనూ తాను నేర్చుకోవాల్సింది ఉంటుందని, మార్పు తీసుకురాగలదని చెప్పే అరుదైన కథ ఇది. దర్శకుడు ఎంతో అద్భుతంగా రాశారీ కథ. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతున్న రాత్రి అనే వాక్యంతో కథ మొదలువుతుంది. ఈ ఒక్క సన్నివేశం చిత్రీకరించేందుకు దర్శకుడు 12 రాత్రులు తీసుకున్నారు. అంటే జీవితం ఎలా సాగుతుందో అంతే సహజత్వంతో దర్శకుడు సినిమాను రూపొందించారు. నిర్మాత బొమ్మక్ మురళి, కనకదుర్గ ఒక మంచి సినిమా చేయాలని కలగన్నారు. మీ ప్రయత్నాన్ని ప్రేక్షకులు గుర్తిస్తారు. ఇట్లు అమ్మ సందేశాలు ఇవ్వదు. గొంతెత్తి కేకలు వేయదు. మిమ్మల్ని ఆలోచించేలా చేస్తుంది. అని చెప్పారు.


    
దర్శకుడు సి. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ...ప్రపంచంలో జరిగే హింస, బేధాల వల్ల ఎక్కువ బాధకు గురయ్యేది అయ్యేది స్త్రీ. ముఖ్యంగా అమ్మ. ప్రపంచ గతిని మార్చేశక్తి స్త్రీలకు ఉంది అనేది మా నమ్మకం. హింస, తేడాలు లేని గొప్ప సంఘాన్ని స్థాపించగల శక్తి మహిళ సొంతం. ఇందుకు తల్లులందురూ ఏకమవ్వాలి అని చెప్పేందుకు ఈ చిత్రాన్ని రూపొందించాం. మహిళ నాలుగు గోడలకు పరిమితం కాకూడదు. సమాజాన్ని తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి, తమ అభిప్రాయాలను గొంతెత్తి చెప్పాలి. అలా ఓ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన మహిళ చేసిన ప్రయత్నమే ఈ చిత్ర కథ. పురోగతి చెందే సమాజంలో మహిళ ప్రధాన భాగం కావాలని కథలో చూపిస్తున్నాం. వాస్తవికమైన దృశ్యాల ద్వారా, నిజమైన జీవితాలను, భావాలను చెబితే అది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అలా చెప్పేందుకు సహజమైన భావోద్వేగాలు చూపించే నటి కావాలి. ఆ సమర్థత ఉన్న నటి రేవతి. అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: