టాలీవుడ్ ప్రముఖ నటి స్నేహ భర్త ప్రసన్న, మరో నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు విషయానికి వస్తే వరలక్ష్మి శరత్‌కుమార్ సినిమాలు ఇతర హీరోయిన్లు నటించేదాని కాస్త వెరైటీగా ఉంటాయి. మాములుగా సినిమాలలో విలన్ అంటే మాత్రం ఎవరికైనా మగవారే గుర్తొస్తారు. కానీ విలన్ గెటప్స్ ని మేం కూడా వేసి చూపిస్తామని నిరూపించారు వరలక్ష్మి. ఆవిడ ఎన్నో సినిమాల్లో ఆమె మగరాయుడిలా విలన్ పాత్రల్లో నటించి ఆయన మెప్పించారు. అయితే ఇప్పుడు చాలా కాలం తర్వాత ఆమె ఇప్పుడు తెలుగులో ‘నాంది’ అనే సినిమాలో నటిస్తున్నారు.

 

Image result for varalakshmi sarathkumar

 

ఈ సినిమాలో అల్లరి నరేష్ ప్రధాన పాత్ర చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్‌ లుక్ కూడా విడుదలైంది. ఈ సినిమా లుక్‌ లో నరేష్ న్యూడ్ గెటప్‌ లో కనిపించారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో తన లుక్‌ ను వరలక్ష్మి ట్విటర్‌ ద్వారా షేర్ చేసారు. అందులో బ్లాక్ అండ్ వైట్ లుక్‌ లో చీర కట్టులో సిగ్గుపడుతూ చాలా అందంగా కనిపించారు ఆమె. ఈ లుక్‌ ని షేర్ చేస్తూ నేను ‘అప్పట్లో అలా సిగ్గుపడుతుండేదాన్ని’ అని క్యాప్షన్ ఇచ్చారు. దీనితో ఈ పోస్ట్ పై నటుడు ప్రసన్న కామెంట్ చేస్తూ "సిగ్గా? నీకా? నీకు సిగ్గు కూడా ఉందా?" అని అన్నాడు. దీనికి గాను వరలక్ష్మి రిప్లై ఇస్తూ ‘అందుకే అప్పట్లో అని పేర్కొన్నాను’ అని అన్నారు. ఇంతక ముందు ‘నిబునన్’ అనే తమిళ సినిమాలో వరలక్ష్మి, ప్రసన్న కలిసి ఆ సినిమాలో నటించారు.

 

Image result for <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=HEROINE' target='_blank' title='heroine-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>heroine</a> <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=ALLU SNEHA' target='_blank' title='sneha-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>sneha</a> husband

అయితే వరలక్ష్మి ‘తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్’ అనే సినిమాతో టాలీవుడ్‌ లోకి అడుగుపెట్టారు. ఈ సినిమాలో ఆమె విలన్ పాత్రని చేశారు. ఇదేకాక మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ‘క్రాక్’ సినిమాలోనూ వరలక్ష్మి జయమ్మ అనే పాత్ర చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: