ప్రపంచంలో ఇప్పటి వరకు ఎన్నో యానిమేషన్ చిత్రాలు వచ్చాయి. అయితే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చిన్న పిల్లలనే కాదు.. పెద్దల మనసు సైతం దోచుకుంటున్న టామ్ అండ్ జర్రీ షో మొదలై ఇప్పటికీ 80 ఏళ్లు పూర్తి చేసుకుంది.  ఒకప్పుడు దూరదర్శిన్ ప్రసారాల్లో  టామ్ అండ్ జర్రీ ఎంత క్రేజ్ ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టామ్ అండ్ జర్రీ  వస్తుందంటే చాలు పిల్లా, పెద్ద టివిలకు అతుక్కు పోయేవారు.  టామ్ పిల్లి మరియు జెర్రీ ఎలుక. ప్రతి ఎపిసోడ్ లోను టామ్ జెర్రీ వెంట పడటం, జెర్రీ తెలివిగా టామ్ బారి నుండి బయట పడటం జరుగుతుంది. అయితే టామ్ అండ్ జర్రీ జర్నీ ఇనాటిది కాదు. 1940, ఫిబ్రవరి 10న మొట్టమొదటిసారి 'టామ్‌ అండ్ జెర్రీ' ప్రసారమైంది.  అప్పట్లో ఇది 'టామ్‌ అండ్ జెర్రీ' పేరుతో కాకుండా 'ది మిడ్‌నైట్‌ స్నాక్‌' పేరుతో వచ్చింది.

 

'పస్ గెట్స్ ది బూట్' ఎపిసోడ్ పేరుతో మొట్టమొదటి షార్ట్‌ ఫిలిమ్ విడుదలైంది. అయితే పిల్లి పేరు జాస్పర్‌గా, ఎలుక పేరు జింక్స్‌గా అప్పట్లో రూపొందించారు.  మిక్కీమోస్ తర్వాత కార్టూన్ చిత్రాలకు బాగా క్రేజ్ పెరిగిపోయింది.  ఈ తరహా యానిమేషన్‌ సినిమాలను ప్రేక్షకులు విరగబడి చూస్తున్న కాలమది. అమెరికాలో విలియం హన్నా, జోసెఫ్‌ బార్బెరా అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ప్రపంచంలోనే పురాతనమైన ఫిలింస్టూడియోస్‌ ‘ఎమ్‌జీఎమ్‌’ (మెట్రో గోల్డ్‌విన్‌ మేయర్‌ స్టూడియోస్‌) కంపెనీలో పనిచేసేవారు.  1940లో 'ది మిడ్‌నైట్‌ స్నాక్‌' గా మొదలు పెట్టి 1958 వరకు మొత్తం 114 ‘టామ్‌ అండ్‌ జెర్రీ’ సినిమాలను రూపొందించారు.

 

వీరికి ఏడు ఆస్కార్‌ అవార్డులు దక్కాయి. జాన్‌కార్‌ అనే యానిమేటర్‌ వీటికి టామ్, జెర్రీ అని పేరు పెట్టి 50 డాలర్ల బహుమతి పొందాడు.  సాధారణంగా పిల్లీ ని చూస్తే ఎలుక పరుగు పెడుతుంది.. కానీ టామ్ అండ్ జర్రీలో పిల్లినే నానా కష్టాలు పెడుతుంది ఎలుక.  ఈ రెండు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ చేసే అల్లరి చూస్తుంటే పిల్లలు కేరింతలు కొడతారు. ఈ నేపథ్యంలో ఆపై ఇవి రెండూ కలిసి సాధించిన విజయాలు అన్నీ ఇన్నీ కావు.టామ్‌ అండ్‌ జెర్రీ 80 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో ఈ పిల్లి, ఎలుకలను నెటిజన్లు గుర్తు చేసుకుంటూ ట్వీట్లు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: