టాలీవుడ్ సినిమా పరిశ్రమకు మొదట రచయితగా కొన్ని సినిమాలకు పనిచేసిన కొరటాల శివ, రవితేజ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన భద్ర అనే సినిమాకు కథను అందించి మంచి పేరు సంపాదించాడు. అయితే అంతకుముందు గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాకు కూడా శివ కథ అందించడం జరిగింది. ఇక ఆయన కథ అందించిన రెండవ సినిమా, భద్ర విజయం తర్వాత మున్నా, ఒక్కడున్నాడు, బృందావనం, ఊసరవెల్లి సినిమాలకు రచయితగా కూడా పని చేసిన శివ, ఆపై యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మిర్చి సినిమా ద్వారా తొలిసారిగా దర్శకుడిగా మారారు. 

 

ఇక ఆయన తీసిన ఫస్ట్ సినిమా మిర్చి సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో పాటు దర్శకుడు దర్శకుడిగా కొరటాలకు మంచి పేరు తీసుకొచ్చింది. అనంతరం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీమంతుడు సినిమాతో అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ కొట్టి, దానితో ద్వితీయ విఘ్నాన్ని కూడా అధిగమించిన శివ, ఆపై జూనియర్ ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్, దాని అనంతరం మరొకసారి మహేష్ బాబు తో భరత్ అనే నేను సినిమాలు తీసి మరొక రెండు సూపర్ డూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. మొదటి నుంచి తన సినిమాల్లో ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ అంశాన్ని కథా వస్తువుగా ఎంచుకునే కొరటాల శివ

 

దానికి ప్రేక్షకులను ఆకట్టుకునేలా మంచి కమర్షియల్ హంగులతో పాటు అలరించే యాక్షన్ సీన్స్ ను కూడా జోడించి సినిమా తీయటంలో మంచి దిట్ట అనే చెప్పాలి. ఇక కెరీర్ పరంగా నాలుగు సినిమాలతో వరుస విజయాలు అందుకున్న కొరటాల, ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆయన 152 సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమా దేవాదాయ శాఖలో జరుగుతున్న విగ్రహాల చోరీ, అవినీతి, అక్రమాలకు సంబందించిన పాయింట్ తీసుకొని కొరటాల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: